Did you know that Harish Shankar wife is a star actress

Harish Shankar: తన సినీ కెరియర్లో గబ్బర్ సింగ్, మిరపకాయ్, గద్దల కొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,దువ్వాడ జగన్నాథం, వంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.ఇక ఈయన తీసిన షాక్, రామయ్య వస్తావయ్యా వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. అయితే స్టార్ దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరున్న హరీష్ శంకర్ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా అంత హిట్ అయితే కాలేదు.

Did you know that Harish Shankar wife is a star actress

ఈ సినిమాతో హరీష్ శంకర్ పై చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ భార్య సినిమాల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని,ఆమె ఓ సినిమాలో కూడా నటించింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఫోటోలు వైరలవుతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే.. రవితేజ, రిచా గంగోపాధ్యాయ,దీక్ష సేథ్ లు కలిసిన నటించిన మిరపకాయ్ సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ హరీష్ శంకర్.. (Harish Shankar)

Also Read: Prabhas: ప్రభాస్ సినిమాలో చేయబోతున్న ఇమాన్వీ ఆ డాన్సర్ కూతురా..?

అయితే ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయతో పాటు ఆమె స్నేహితురాలి క్యారెక్టర్ లో స్నిగ్ధ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించింది. ఇక ఈమె అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఆమె తన గొంతుతో చాలా ఫేమస్ అయింది.అలా రీచా గంగోపాధ్యాయ పక్కన ఉన్న నటి హరీష్ శంకర్ భార్య అని చాలామంది సోషల్ మీడియాలో ఈమె ఫోటోను వైరల్ చేస్తున్నారు.

 Did you know that Harish Shankar wife is a star actress

అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్.స్నిగ్ద నా భార్య అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని, అయితే నా భార్య పేరు కూడా స్నిగ్ధ కావడంతో అందరూ ఆమెనే నా భార్య అని పొరపాటు పడుతున్నారు. ఆమె నా భార్య కాదు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే స్నిగ్ధ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి అవకాశాలు వస్తున్నా కూడా ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి విదేశాల్లో సెటిల్ అయిందని చెప్పారు.(Harish Shankar)