Double Ismart beauty Kavya Thaper love with that hero

Kavya Thaper: కావ్య థాపర్.. డబుల్ ఇస్మార్ట్ మూవీలో తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో అందాల ఆరబోత చేసి సినిమా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ గ్లామర్ తో అందరినీ పడగొట్టిన ఈ బ్యూటీ కి సంబంధించి తాజాగా ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది.. కావ్య థాపర్ ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉందని సోషల్ మీడియా మొత్తం కొడై కూస్తోంది. మరి ఇంతకీ కావ్య థాపర్ ప్రేమలో పడ్డ బాలీవుడ్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

Double Ismart beauty Kavya Thaper love with that hero

మోడల్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కావ్య థాపర్ హీరోయిన్ అవ్వాలనే కోరికతో హిందీలో ఓ షార్ట్ ఫిలిం చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక కావ్య థాపర్ తెలుగులోకి ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో వచ్చింది. అయితే ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. దాంతో కావ్య థాపర్ కి అంత పేరైతే రాలేదు. (Kavya Thaper)

Also Read: Raj Tarun: ఆ హీరో మగాడు కాదు.. రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణ..?

ఆ తర్వాత ఏక్ మినీ కథ,ఈగల్,ఊరి పేరు భైరవకోన,తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది.. కానీ ఈ హీరోయిన్ కి ఏ సినిమా కూడా అంత పేరు తెచ్చి పెట్టడం లేదు.. ఇక కావ్య థాపర్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా నటిస్తోంది. ఇక సినిమాలు మాత్రమే కాదు కావ్య థాపర్ కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

Double Ismart beauty Kavya Thaper love with that hero

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉందనే న్యూస్ బీటౌన్ లో చక్కర్లు కొడుతుంది.అయితే ఆ హీరో తో తన రిలేషన్ ని సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తుందని,ఇంకా దాని గురించి బయట పెట్టలేదని సమాచారం. మరి కావ్య థాపర్ ప్రేమలో ఉన్న ఆ నటుడు ఎవరో తెలియాల్సి ఉంది.(Kavya Thaper)