Venu Swamy Journalist Murthy dispute

Venu Swamy: గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో మెయిన్ మీడియా లో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి జర్నలిస్టు మూర్తి కి సంబంధించిన వివాదమే..మూర్తి తనని 2017 నుండి ఎంతో టార్చర్ చేస్తున్నాడని, ఐదు కోట్లు ఇస్తే సైలెంట్ గా ఉంటానని, లేకపోతే నీపై ఏదో విధంగా దాడి చేస్తూనే ఉంటానని మూర్తి తనతో చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయి అంటూ వేణు స్వామి ఆయన భార్య సంచలన వీడియో విడుదల చేశారు. అలాగే తనకు వ్యతిరేకంగా డిబేట్ లు పెట్టడమే కాకుండా కొంతమంది ఫేక్ జ్యోతిష్యులను తీసుకువచ్చి నాపై పరో lక్ష దాడి చేయిస్తున్నాడు.

Venu Swamy Journalist Murthy dispute

నేను అందరి మంచి కోరుకోవడం కోసమే వారి జాతకాలు చెబుతాను.కానీ ఆ జర్నలిస్టు మాత్రం మమ్మల్ని ఎంతో వేధింపులకు గురి చేస్తున్నాడు. గత ఎనిమిది నెలల నుండి నా మీద దాడీ మరీ ఎక్కువైంది. అందుకే ఈ 8 నెలల్లో నేను ఏకంగా 15 కిలోల బరువు కూడా తగ్గాను అని చెప్పాడు. అంతేకాదు ఇక వేణు స్వామి భార్య అయితే ఆయన బాధ తట్టుకోలేక 5కోట్లు ఇవ్వలేక మేము సూసైడ్ చేసుకోవాలని చూసాం.కానీ మేము సూసైడ్ చేసుకున్నా కూడా వాళ్ళు వేరే విధంగా వార్తలు రాస్తారు. ( Venu Swamy)

Also Read: Kushboo: ఆ హీరో కి రెండో భార్య అవ్వాలనుకున్న కుష్బూ.. ఇంట్లో సీక్రెట్ గా పెళ్లి..?

అందుకే వారి కోసం మేమెందుకు చనిపోవాలి అని సైలెంట్ అయ్యా. మమ్మల్ని ఇంకోన్ని రోజులు బతకనిస్తే మూర్తి కి సంబంధించిన ఇంకా ఎన్నో బాగోతాలు బయటపెడతాం అని చెప్పింది.అయితే ఈ వీడియో పై స్పందించిన జర్నలిస్టు మూర్తి వాళ్ళు మాట్లాడిన వీడియోలో ఎలాంటి నిజం లేదు. నేను ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలు చూపిస్తే నన్ను రాళ్లతో కొట్టి ఇప్పుడే చంపేయండి. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నేను చనిపోయాక నా గురించి ఈ విషయం బయటపడిన నా ఎముకలకు ద్రోహి అ నేట్యాగ్ వెయ్యండి.

 Venu Swamy Journalist Murthy dispute

నేను ఎంతోమంది పెద్దపెద్ద లీడర్లకి సంబంధించి పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టాను.అప్పుడే వాళ్ళు ఇచ్చిన డబ్బుకు లొంగలేదు. ఇప్పుడు వీరి దగ్గర డబ్బు ఎందుకు డిమాండ్ చేస్తాను. నేను ఎవరి దగ్గరా చెయ్యి చాచి రూపాయి అడగను. నా పనికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే నేను చేసే జర్నలిజంలో తీసుకుంటాను.కానీ ఇతరుల దగ్గర నుండి నేను రూపాయి కూడా తీసుకోను.ఐదు కోట్ల డబ్బు నేను అడిగినట్టు రుజువైతే అన్నింటికి సిద్ధమై ఉన్నాను. అంటూ మూర్తి సంచలన వీడియో బయటపెట్టారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.( Venu Swamy)