Hema wants to get married for the second time at the age of 57

Hema: దాదాపు 250 కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి హేమ అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది.ఇక హేమ పేరు గత మూడు నెలలుగా మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం ఆమె బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిపోవడమే. అయితే అది రేవ్ పార్టీ కాదు బర్త్డే పార్టీ అని హేమ పదేపదే చెబుతుంది.అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కుందని, ఆమె డ్రగ్స్ తీసుకుందని చాలామంది మీడియా వాళ్ళు ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీంతో మీడియాపై ఫైర్ అయిన హేమ నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు.

Hema wants to get married for the second time at the age of 57

డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అలాగే ఎవరైతే నన్ను మా నుండి సస్పెండ్ చేశారో మళ్లీ వాళ్లే నా తప్పు లేదని తెలిసి నాకు ఇచ్చిన సస్పెండ్ లెటర్ ని వెనక్కి తీసుకున్నారు. కానీ మీడియా వాళ్లే నాపై తప్పుడు రాతలు రాస్తున్నారు అంటూ హేమ మీడియాపై ఫైర్ అయింది.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ పాల్గొంది.అయితే ఆ చానల్ ఇంటర్వ్యూ చేసే యాంకర్ రోషన్ డ్రగ్స్ కేసు రేవ్ పార్టీ గురించి మాట్లాడుతూ.. మీ ఆయన మీరు కలిసే ఉంటున్నారా.. అంటూ షాకింగ్ క్వశ్చన్ అడిగారు.దానికి హేమ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది.హేమ మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసే ఉన్నాం. (Hema)

Also Read: Samantha: డైరెక్టర్ తో రెండో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న సమంత..?

ఒకవేళ విడాకులు తీసుకుంటే నీకు చెప్పే విడాకులు తీసుకుంటాంలే.. మళ్లీ నాకు మరో సంబంధం చూద్దువు అంటూ హేమ మాట్లాడింది. దానికి యాంకర్ రోషన్ మళ్ళీ పెళ్లేం చేసుకుంటావులే ఈ వయసులో అని పంచ్ వేశాడు.దానికి హేమ ఊరుకుంటుందా? ఏ ఎందుకు చేసుకోకూడదు.. నాకేం తక్కువ.. నేను మా ఆయనతో విడిపోతే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా.. కానీ మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు విడాకులు ఇవ్వరు.నేను నా లైఫ్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను.కానీ కావాలనే కొంతమంది నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

Hema wants to get married for the second time at the age of 57

సిపి నా పేరు చెప్పకపోయినా కూడా మీడియా వాళ్ళు కావాలనే పదేపదే నా పేరు అడిగారు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వారి గురించి మీడియాలో బ్రేకింగ్ వార్తలు వేయట్లేదు. కానీ నా విషయంలో మాత్రం ఒకటి తర్వాత ఒకటి ఎన్నో బ్రేకింగ్ లు వేస్తారు.అందులో ఎలాంటి నిజం లేకుండా కూడా దాన్ని వైరల్ చేస్తూనే ఉన్నారు. మీడియా వాళ్లకి నోటి దూల దురద ఎక్కువ గా ఉంది అంటూ రోషన్ ఎదురుగానే హేమ తిట్టేసింది. ఇక హేమ మాటలకి రోషన్ కూడా నవ్వేశారు. అయితే హేమ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో 57 ఏళ్ల వయసులో భర్త వదిలేస్తే రెండో పెళ్లి చేసుకుంటావా అంటూ చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Hema)