Ileana wanted to commit suicide for that Telugu director

Ileana: గోవా సుందరి ఇలియానా నిజంగానే ఆ టాలీవుడ్ డైరెక్టర్ కోసం సూసైడ్ చేసుకోవాలనుకుందా.. ఇంతకీ ఇలియానా సూసైడ్ చేసుకోవాలనుకున్నది ఏ డైరెక్టర్ కోసమో ఇప్పుడు చూద్దాం.. చాలామంది నటీమణులు సినిమాల మీద ఉన్న పిచ్చి ఇష్టంతో సినిమాల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తారు.అయితే బ్యాగ్రౌండ్ ఉన్న వారికే క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పట్లేదు.

Ileana wanted to commit suic*de for that Telugu director

అలాంటిది బ్యాగ్రౌండ్ లేని వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో అందరూ అలా ఉంటారని కాదు. కానీ అందరూ అలా ఉండరు అని కూడా చెప్పడానికి వీల్లేదు.ఈ సమాజంలో ఎక్కడో ఒక మూలన ఏదో ఒక చీడపురుగు ఉండనే ఉంది. అది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే మహిళలను వేధించే వాళ్ళు ఉన్నారు.అయితే రామ్ పోతినేని తో దేవదాసు మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోయిన్గా వచ్చిన ఇలియానా ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. (Ileana)

Also Read: Aishwarya Rai: ఆ హీరోని ఐశ్వర్య సీక్రెట్ గా పెళ్లాడిందా.. అక్కడికి హనీమూన్ కి కూడా ..?

అలా పోకిరి, జల్సా, జులాయి, ఆట, కిక్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇలియానా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఒకప్పుడు పేరు తెచ్చుకుంది.అయితే అందరిలాగే సినిమాల్లోకి రావడానికి ఇలియానా కూడా ఎంతో టార్చర్ అనుభవించిందట. అలా సినిమాల్లోకి వచ్చే సమయంలో ఇలియానాని హీరోయిన్ గా పరిచయం చేస్తామని కొంతమంది డైరెక్టర్లు తమ కామ వాంఛ తీర్చుకోవాలని చూశారట.

 Ileana wanted to commit suicide for that Telugu director

అందులో ఓ తెలుగు డైరెక్టర్ కూడా ఉన్నాడని ఇలియానా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. అంతే కాదు వారి కామ వాంఛ తీర్చలేక సూసైడ్ చేసుకోవాలని కూడా నిర్ణయించుకుందట.కానీ ఆ తర్వాత ఫ్యామిలీ గుర్తుకు వచ్చి తన ఆలోచన పక్కన పెట్టిందట. అలా సినిమా అవకాశాలు అంతా సింపుల్గా రాలేదు అని ఇలియానా చెప్పకనే చెప్పింది.( Ileana)