Kriti Shetty: ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరొక స్టార్ హీరోయిన్ అయ్యేవిధంగా పేరు సంపాదించుకుంది కృతి శెట్టి. అయితే ఆ మురెపం మూడు నాళ్ళు కూడా లేదు. ఆ తర్వాత ఆమె చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విఫలం కావడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయని చెప్పాలి. ఆమె నాని కలిసి చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు రాలేదు. దానికి తోడు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోవడంతో ఈమెతో నటించడానికి హీరోలు కూడా భయపడిపోయారు.

Kriti Shetty New Film ‘Love Insurance

ఫైనల్ గా ఆమెకు శర్వా నంద్ అవకాశం ఇవ్వగా వారిద్దరి కలయికలో వచ్చిన ‘మనమే’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విఫలం అయింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా పెద్దగా పండలేదు. ఈ నేపథ్యంలో ఈమె మంచి సినిమాలను ఎంపిక చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సర్దుకోవాల్సిందే అని అందరూ చెప్పారు. అందుకే కొంత సమయం తీసుకుని మరి ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను ముందుకు రాబోతుంది. ‘లవ్ టుడే’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రదీప్ రంగరాజన్ హీరోగా ఓ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.

Also Read: Chiranjeevi: చిరంజీవి కోసం బాలయ్య ఆ పనిచేస్తాడా!!

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని ఎంచుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలయింది. ‘లవ్ ఇన్సూరెన్స్’ అనే టైటిల్ పరిశీల లో ఉన్నట్లు తెలుస్తుంది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తూ ఉండగా డిఫరెంట్ స్టైల్ లో ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండబోతుందట. మరి కృతి ఈ సినిమాతో విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్ లోకి వస్తుందా అనేది చూడాలి.