Saripodhaa Shanivaram: టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పేరున్న నాని వరస సినిమాలను చేస్తూ ప్రేక్షకులు మెప్పిస్తున్నాడు. గత ఏడాది ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అవి ప్రేక్షకులను అలరించిన నేపథ్యంలో ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో మళ్లీ అందరినీ ఆకట్టుకోవడానికి ముందుకు రాబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి తీసుకుని ఆగస్టు 29వ తేదీన విడుదల కావడానికి సిద్ధమయ్యింది.

Nani Saripodhaa Shanivaram Promotional Tactics

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అలరించగా ఇప్పటికే వచ్చిన ట్రైలర్ పర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. పలు భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా చేస్తున్నాడు నాని. వరుసగా ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటూ ప్రేక్షకులకు సినిమా ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ సినిమా కి అయినా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. పాన్ ఇండియా సినిమాలకు అయితే ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్స్ చేయాలి. అలాంటి సందర్భంలో అన్ని భాషలలో విడుదలవుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా పట్ల అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి.

Also Read: Meenakshi Vs BhagyaSri: వీరికి డిమాండ్ మాములుగా లేదు సామీ!!

అందుకే నాని ఈ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తుండగా ఇంకొక వైపు విలన్ తో కలిసి ఆయ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్ ఈ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. ఇదే దర్శకుడు తో కలిసి నాని చేసిన గత సినిమా ‘అంటే సుందరానికి’ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మళ్ళీ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.