Rashmika spent 15 lakhs for pregnancy

Rashmika: ఏంటి రష్మిక ప్రెగ్నెన్సీ కోసం 15 లక్షల ఖర్చు పెడుతుందా..ఇదెక్కడి విడ్డూరం.. ప్రెగ్నెన్సీ కోసం లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి అంటూ చాలామంది ఈ విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటారు.అయితే రష్మిక ప్రెగ్నెన్సీ 15లక్షలు ఖర్చు చేసింది అంటూ వస్తున్న వార్తల వెనక దిమ్మతిరిగే న్యూస్ ఉంది. మరి ఇంతకీ ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. రష్మిక మందన్నా ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఇండస్ట్రీలో గడుపుతుంది.

Rashmika spent 15 lakhs for pregnancy

అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పుష్ప -2 సినిమా చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ భార్య గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.మొదటి పార్ట్ లో ప్రేమికురాలుగా నటించిన రష్మిక రెండో పార్ట్ లో భార్యగా కనిపించబోతుంది. అయితే ఈ సినిమాలో రష్మికకి ప్రెగ్నెన్సీ అయినట్టు చూపించడం కోసం సుకుమార్ ఏకంగా 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు టాలీవుడ్ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తోంది.(Rashmika)

Also Read: Ileana: ఆ తెలుగు డైరెక్టర్ కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్న ఇలియానా..?

దీంతో ఈ రూమర్ విన్న చాలా మంది నెటిజన్లు ఏంటి రష్మిక ప్రెగ్నెన్సీ కోసం 15 లక్షలా.. మరీ అంత ఖరీదా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడంతో నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారట. అంతే కాకుండా సినిమాకి సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని నాలుగైదు సెట్లలో తెరకెక్కించడం కారణంగా బడ్జెట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుందట.

 Rashmika spent 15 lakhs for pregnancy

ఇక కొన్ని కొన్ని సన్నివేశాలను తెరకెక్కించి ఓకే చేశాక మళ్ళీ వాటిని రిజెక్ట్ చేసి ఫ్రెష్ గా షూట్ చేస్తున్నార. దీంతో చిత్ర యూనిట్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చిన చాలామంది నటీనటులు కూడా షూట్ లేట్ అవుతుండడంతో మిగతా సినిమాల్లో నటించడానికి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారట. కానీ సుకుమార్ మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పుష్ప-3 సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.(Rashmika)