Vijay thalapathy 'The Goat' movie promotions

The Goat: తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలు తెలుగులోనూ సందడి చేస్తూ ఉంటాయి. గత కొన్ని సినిమాలుగా ఆయన చేస్తున్న చిత్రాలు తెలుగులో విడుదలవుతూ భారీ సక్సెస్ను సాధించుకోగా ఇటీవలే చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయని చెప్పాలి. కారణమేదైనా కూడా విజయ్ తన అభిమానులను కూడా అలరించకపోవడం నిరాశపరిచే విషయమనే చెప్పాలి. ఆ విధంగా ఆయన చేసిన వారసుడు, లియో చిత్రాలు విజయాలు పెద్దగా అందుకోలేకపోయాయి.

Vijay thalapathy ‘The Goat’ movie promotions

విడుదలకు ముందే ఈ రెండు సినిమాలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. వారసుడు సినిమాకు నిర్మాత మరియు దర్శకుడు ఇద్దరు తెలుగువారే కావడంతో సంక్రాంతికి ఈ చిత్రాన్ని బరిలోకి దించారు. ఆ విధంగా ఈ సినిమా పండుగ సీజన్లో కూడా నష్టాలను తీసుకు వచ్చింది. దీని ప్రభావం లియో సినిమా పైన ఏమాత్రం పడలేదు. ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం తో ఈ సినిమాకు ప్రీ ప్రమోషన్ భారీగా దక్కింది కానీ విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఆ విధంగా ఆయన ఇప్పుడు చేస్తున్న ‘ది గోట్’ సినిమా పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు.

Also Read: IPL 2025: RCBలోకి జస్ప్రీత్ బుమ్రా…షాక్ లో ముంబై ఫాన్స్ ?

అయితే ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. సెప్టెంబర్ 5వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్, టీజర్ అన్ని కూడా బాగానే కనిపించాయి. కానీ ఈ చిత్రానికి మాత్రం బజ్ పెద్దగా కనిపించడం లేదని చెప్పాలి. దానికి తోడు దర్శకుడు వెంకట్ ప్రభు కూడా పెద్దగా ఫామ్ లో లేడు. ఆయన గత సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో ఈ సినిమా హైప్ క్రియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే తెలుగు ప్రమోషన్స్ కి విజయ్ పెద్దగా రాడనే చెప్పాలి. గతంలో చేసిన లియో సినిమాకి ఆయన తెలుగులో ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలలో కనిపించలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘దిగోట్’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసం విజయ్ ని తీసుకువస్తారా అనేది చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను కొనుగోలు చేయగా విజయ్ వస్తే తప్పకుండా ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది అని వారు నమ్ముతున్నారు.