A family can survive on the cost of Bunny beard.. How much

Bunny: అల్లు అర్జున్ గడ్డం ఖరీదుతో నిజంగానే ఓ ఫ్యామిలీ బతికేయచ్చా.. ఇంతకీ ఆయనకు ఉన్నది నిజమైన గడ్డం కాదా.. అనేది ఇప్పుడు చూద్దాం.. పుష్ప-2 సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.ఈ సినిమా థియేటర్లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అల్లు అభిమానులు అయితే కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా ఆగస్టు 25న వచ్చేది. కానీ కొన్ని మార్పులు చేర్పుల కారణంగా సినిమాని డిసెంబర్ 6 కి వాయిదా వేశారు.

A family can survive on the cost of Bunny beard.. How much

అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో సన్నివేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుకుమార్ దర్శకత్వం చేస్తున్నారు.ఆ సన్నివేషన్లో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా సినిమా షూటింగ్ జరుపుతున్నారట. అయితే పుష్ప టు క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉండబోతుందని ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ రాలేదని ఎంతో డిఫికల్ట్ క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నామని అల్లు అర్జున్ రీసెంట్గా ఓ సినిమా ఈవెంట్లో బయటపెట్టారు. (Bunny )

Also Read: Megha Akash: పెళ్లికి రెడీ అయిన మెగా ఆకాష్.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..?

అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్కే హైలెట్.ఇందులో అల్లు అర్జున్ తన హెయిర్ అలాగే గడ్డంతో మూవీకి హైలైట్ అయ్యారు.. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ తన గడ్డాన్ని తొలగించుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ గడ్డం తీసేయడంతో సుకుమార్ బన్నీ మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ వినిపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.

A family can survive on the cost of Bunny beard.. How much

అయితే పుష్ప టు సినిమాలో బన్నీకి గడ్డం ఉన్నట్టు చూపించాలి. కాబట్టి డూప్లికేట్ గడ్డం కోసం సుకుమార్ భారీ ఖర్చు చేస్తున్నారట.అలా బన్నీకి రియల్ గడ్డంలా చూపించడం కోసం సుకుమార్ దాదాపు 40 లక్షల ఖర్చు చేశారట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ ఆ 40 లక్షలతో ఒక పేద ఫ్యామిలీ హ్యాపీగా బతికేయొచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.(Bunny)