Duvvada Srinivas: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో…గత పది రోజులుగా దువ్వాడ శ్రీను ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కట్టుకున్న భార్యను కాదని మరొక మహిళతో.. సహజీవనం చేస్తున్నారు వైసిపి నాయకులు దువ్వాడ శ్రీనివాస్. దీంతో… దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఆయన భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కూతుర్లు నిరసనకు దిగారు. Duvvada Srinivas

Duvvada Srinivas girl friend

దువ్వాడ శ్రీనివాస్ కట్టుకున్న కొత్త ఇంటి ముందు… గత వారం రోజులుగా నిరసన చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే.. దువ్వాడ శ్రీనివాస ప్రియురాలు మాధురి సూ**సైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ అంశం.. దేశవ్యాప్తంగా హల్చల్ సృష్టిస్తోంది. Duvvada Srinivas

Also Read: IPL 2025: RCBలోకి జస్ప్రీత్ బుమ్రా…షాక్ లో ముంబై ఫాన్స్ ?

అయితే… ఈ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయనపై జగన్మోహన్ రెడ్డి వేటు వేశారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాసులు తొలగించారు జగన్మోహన్ రెడ్డి. Duvvada Srinivas

దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో… ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా పెరాడ తిలక్ ను నియామకం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇకపైన వైసిపి పార్టీ నియోజకవర్గ వ్యవహారాలను తిలక్ మాత్రమే నిర్వహించనున్నారు. ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా… టెక్కలి నియోజకవర్గ టికెట్ దువ్వాడ శ్రీనివాస్కు దక్కేలా కనిపించడం లేదు. Duvvada Srinivas