Is Sobhitha ready to sing an item song with that hero

Sobhitha: శోభిత కూడా సమంత బాటలోనే వెళ్లబోతోందా.. నిజంగానే ఆ హీరోతో ఐటమ్ సాంగ్ కి ఓకే చేసిందా? బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలో ఎంత నిజముంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఎప్పుడైతే శోభిత అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళబోతుంది అనే న్యూస్ అధికారికంగా బయటపడిందో అప్పటినుండి ఫ్యామిలీ కంటే ముందు అభిమానులే శోభితకి కండిషన్స్ పెడుతున్నారు.

Is Sobhitha ready to sing an item song with that hero

ఎందుకంటే మొదటి పెళ్లి విఫలమైంది కాబట్టి రెండో పెళ్లి విషయంలో అలా జరగకూడదని శోభిత బోల్డ్ పాత్రలను వదిలేసి సాంప్రదాయమైన పాత్రలను ఎంచుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే తాజాగా బీటౌన్ లో ఓ న్యూస్ వినిపిస్తోంది.అదేంటంటే..శోభిత ధూళిపాళ్ల ఓ బాలీవుడ్ హీరోతో కలిసి ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ హీరో ఎవరు కాదు రణ్ వీర్ సింగ్.. (Sobhitha)

Also Read: Shradda Kapoor: స్త్రీ 2 మూవీ హీరోయిన్ ఆ పెళ్లయిన హీరోతో ప్రేమలో పడిందా.?

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్లో త్వరలోనే డాన్ 2కి సీక్వెల్ గా డాన్ 3 మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం జరగబోతున్నట్టు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో స్పెషల్ సాంగ్ చేయడం కోసం శోభిత ధూళిపాళ్ల ని చిత్ర యూనిట్ కలవగా ఆమె చేస్తాను అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Is Sobhitha ready to sing an item song with that hero

ఇక ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామందిని నెటిజన్స్ సమంత బాటలోనే శోభిత కూడా ప్రయాణిస్తుంది. సమంత లాగే శోభిత కూడా ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.. ఒకవేళ నిజంగానే ఐటమ్ సాంగ్ చేస్తే మాత్రం అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది అంటూ కొంతమంది జనాలు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఆ స్పెషల్ సాంగ్ ని శోభిత రిజెక్ట్ చేయడమే మంచిది అని అంటున్నారు.మరి చూడాలి శోభిత నిజంగానే ఆ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనేది.(Sobhitha)