Prithvi Shaw: టీమిండియా స్టార్ ఓపెన్ పృథ్వీ షా జూలై 2021 నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం షా, యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో చాహల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి స్టోరీలో ఓ స్పెషల్ ఫోటోను పంచుకున్నాడు. Prithvi Shaw

Prithvi shaw petrol pump photo viral

ఇందులో పృథ్వీ షా పెట్రోల్ పంపు దగ్గర కారులో ఇంధనాన్ని నింపుతున్నట్లు కనిపించాడు. పృథ్వీ షా ఇంగ్లాండ్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరిచాడు. కానీ టీమిండియాలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. Prithvi Shaw

Also Read: IPL 2025: RCBలోకి జస్ప్రీత్ బుమ్రా…షాక్ లో ముంబై ఫాన్స్ ?

చాలా చిన్న వయసులోనే విజయాలను సాధించాడు. ఈ యువ ప్లేయర్ ని దిగజ క్రికెటర్లతో పోల్చడం ప్రారంభించారు. 2013లో ముంబైలో జరిగిన క్లబ్ మ్యాచ్ లో పృథ్వీ షా 500 పరుగులకు పైగా ఇన్నింగ్స్ ఆడి వెలుగులోకి వచ్చాడు. Prithvi Shaw

తర్వాత ఆతని నాయకత్వంలో టీమ్ ఇండియా అండర్-19 ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. అతను కూడా టీమిండియాలో చేరాడు. కానీ కొంతకాలం తర్వాత తప్పుకున్నాడు. అతని పేరు కూడా అనేక వివాదాలతో ముడిపడి ఉంది. దాని కారణంగా ఈ యువ ప్లేయర్ సంచలనానికి అనేక సమస్యలు కూడా పెరిగాయి. Prithvi Shaw