Kiran Abbavaram gave a special gift to his wife

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ ల పెళ్లి ఆగస్టు 22న అంగరంగ వైభవంగా కర్ణాటకలోని కూర్గ్ లో జరిగింది.. అయితే మొదట వీరు కేరళలో తమ పెళ్లిని గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకున్నప్పటికీ కేరళలో జరిగిన విపత్తు కారణంగా తమ పెళ్లి వెన్యూని అక్కడ నుండి కర్ణాటక కు మార్చేశారు. అలా బంధువులు, కుటుంబ సభ్యుల మధ్యలో రహస్య గోరక్, కిరణ్ అబ్బవరం ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Kiran Abbavaram gave a special gift to his wife

అయితే ఈ పెళ్లిలో కిరణ్, రహస్యలు సాంప్రదాయ బద్దంగా పట్టు పంచే, పట్టు చీర కట్టుకొని కనిపించారు. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం పెళ్లయ్యాక తన భార్యకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది.. మరి ఇంతకీ కిరణ్ అబ్బవరం రహస్యకి ఇచ్చిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే.. రహస్య గోరక్ కిరణ్ అబ్బవరం ల మధ్య ప్రేమ దాదాపు 5 సంవత్సరాలుగా కొనసాగుతోంది.వీరిద్దరూ రాజా వారు రాణి గారు అనే సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు.(Kiran Abbavaram)

Also Read: Urvasi Rautela: ఆయన వల్ల ప్రెగ్నెంట్ అయిన చిరంజీవి హీరోయిన్.. సీక్రెట్ గా అబార్షన్.?

ఈ సినిమాలో కిరణ్ రహస్యలు హీరో హీరోయిన్స్ గా చేశారు. అలా సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.అలా ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాల్లో నటించారు. కానీ రహస్య మాత్రం తెలుగులో ఒకే ఒక్క సినిమాకి పరిమితమైంది. అలా దాదాపు ఐదు సంవత్సరాలు వీరు సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేశారు.

Kiran Abbavaram gave a special gift to his wife

కానీ ఎట్టకేలకు మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక తన భార్య రహస్య గోరక్ మీద ప్రేమతో కిరణ్ అబ్బవరం దాదాపు కోటి విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ భార్య అంటే ఎంత ప్రేమో అని పొగుడుతున్నారు. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.(Kiran Abbavaram)