Nagarjuna 'Shobhita Entry' did not come together.. all the properties were lost

Nagarjuna: నాగార్జున కి శోభిత కొత్త కోడలుగా ఇంట్లోకి రావడం కలిసి రాలేదా అని మాట్లాడుకుంటున్నారు తాజా పరిణామాలు చూసిన జనాలు..మరి ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తాజాగా హైదరాబాద్లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చి వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇది అక్రమ కట్టడం తమ్మిడి కుంట చెరువులోని దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి మరీ ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కట్టారని గతంలో ఆరోపణ వచ్చింది.

Nagarjuna ‘Shobhita Entry’ did not come together.. all the properties were lost

ఇక అందుకు తగ్గట్లుగానే తాజాగా రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలని కూల్చి వేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై కూడా ఉక్కు పాదం మోపింది. దాంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర భారీ పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు చేపడుతోంది. అయితే తాజాగా నాగార్జున కి సంబంధించిన ఆస్తులు పోవడంతో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. (Nagarjuna)

Also Read: Sobhitha: సామ్ బాటలో శోభిత.. ఆ హీరో తో ఐటెం సాంగ్ కి రెడీ.. కోపంలో చైతూ.?

అదేంటంటే.. నాగార్జున ఇంట్లోకి కొత్త కోడలు శోభితా రాక అస్సలు కలిసి రాలేదని.. ఆమె రాకతో నాగార్జునకి సంబంధించిన అంత పెద్ద ఆస్తి నేల మట్టం అయిందని,శోభిత రాక అక్కినేని ఫ్యామిలీకి కలిసి రావడం లేదని, ఎంగేజ్మెంట్ కే ఇంత జరిగితే పెళ్లయ్యాక ఇంకెంత జరుగుతుందోనని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

Nagarjuna 'Shobhita Entry' did not come together.. all the properties were lost

దీంతో నేటిజన్స్ పెట్టిన పోస్టులు మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికి అక్రమ కట్టడాలు కడితే ఎప్పటికైనా అవి నేల మట్టమవుతాయి. అయితే అక్రమ కట్టడానికి శోభితకి మధ్య లింకెందుకు.. అది అక్రమ కట్టడం కాబట్టి కూల్చేశారు.దానికి శోభిత ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఏంటి సంబంధం అంటూ కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ ఈ సోషల్ మీడియా మీమ్స్ పై ఫైర్ అవుతున్నారు.(Nagarjuna)