What Balakrishna said that day about Nagarjuna N convention was true

Balakrishna: నందమూరి బాలకృష్ణ కి,అక్కినేని నాగార్జున కి మధ్య కోల్డ్ వార్ ఉందని, ఇద్దరి మధ్య మాటలు లేవని ఇండస్ట్రీలోని ఎంతోమంది చెబుతారు. ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఎలాంటి ఈవెంట్లో కూడా ఎక్కువగా పాల్గొనరు. ఒకవేళ ఇద్దరు ఒకే ఈవెంట్లో పాల్గొనాల్సి వచ్చినా ఎడమొహం పెడమొహంగా ఉంటారు.. వీరి తండ్రులు ఎంతో బాగా కలిసి ఉన్నప్పటికీ వీరి మధ్య మాత్రం సఖ్యత లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీరు చాలా బాగా కలిసి ఉన్నారు..

What Balakrishna said that day about Nagarjuna N convention was true

ఒక తల్లి బిడ్డల్లా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కడ గొడవ వచ్చిందో కానీ ఇద్దరు మధ్య ప్రస్తుతం మాటలు లేవు. అయితే తాజాగా నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని అక్రమ కట్టడం అని తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. (Balakrishna)

Also Read: Nagarjuna: నాగార్జున కి ‘శోభిత రాక’ కలిసి రాలేదా.. ఆస్తులన్నీ మాయం.?

అయితే ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు కొంత మంది నెటిజనస్.అయితే ఆ వీడియోలో బాలకృష్ణ ఏం మాట్లాడారంటే ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు సినిమా వాళ్ళ సమస్యల గురించి చాలా సార్లు మీటింగ్లు పెట్టుకున్నారు.కానీ వాళ్ళు ఎవరు కూడా నన్ను ఒక్కసారి కూడా మీటింగ్ లకి పిలవలేదు. వాళ్లందరూ భూములు పంచుకుంటారు అంటూ బాలకృష్ణ చాలా కోపంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.

What Balakrishna said that day about Nagarjuna N convention was true

అయితే బాలకృష్ణ మాటలు ఇప్పటివి కాకపోయినప్పటికీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేయడంతో దీనికి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్స్ బాలకృష్ణ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. బాలకృష్ణ ఏం మాట్లాడినా కూడా అందులో 100 కి 200% నిజమే మాట్లాడతారు.. అంటూ బాలకృష్ణకు సంబంధించిన వీడియోకి క్యాప్షన్ పెడుతూ కొంతమంది నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.(Balakrishna)