7 years of Arjun Reddy: Unlucky heroes who rejected Arjun Reddy movie

7 years of Arjun Reddy: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన మొదటి మూవీ అర్జున్ రెడ్డి..మొదటి సినిమాతోనే తన దర్శకత్వం ప్రతిభ ఎలాంటిదో సినీ ఇండస్ట్రీకి చాటి చెప్పాడు సందీప్ రెడ్డి వంగ.. ఇక సందీప్ రెడ్డి వంగ 2010 నుండి ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే మొదటిసారి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే మూవీ కి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఇక ఈయన దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి..

7 years of Arjun Reddy: Unlucky heroes who rejected Arjun Reddy movie

అయితే ఈ సినిమా కోసం మొదట్లో శర్వానంద్ ని అనుకున్నప్పటికీ ఆయన రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత విజయ్ దేవరకొండను తీసుకున్నారు.అయితే మొదటి సినిమా కావడంతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. దాంతో సందీప్ రెడ్డి వంగా తండ్రి, అన్నయ్య ఇద్దరు కలిసి భద్రకాళి పిక్చర్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఐదు కోట్ల బడ్జెట్ పెట్టి ఈ మూవీని తెరకెక్కించారు. (7 years of Arjun Reddy)

Also Read: Salman Khan: ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని ఇల్లు కట్టించిన సల్మాన్ ఖాన్.. నిజమేనా.?

5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ ఆగస్టు 25,2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటివరకు అంత నేమ్ ఫేమ్ లేని డైరెక్టర్ హీరో హీరోయిన్ కి ఓవర్ నైట్ లో స్టార్టడం వచ్చింది. అలా ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కి స్టార్ దర్శకుడిగా.. విజయ్ దేవరకొండ కి స్టార్ హీరోగా పేరు వచ్చింది.

7 years of Arjun Reddy: Unlucky heroes who rejected Arjun Reddy movie

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన నటనకి ఎంతోమంది బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు పడిపోయారు. ఈయనతో డేటింగ్ చేయాలని ఉందని పబ్లిక్ గానే కొన్ని ఈవెంట్ల లో బయట పెట్టారు. అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ని మొదట శర్వానంద్ తో చేయాలనుకున్నప్పటికీ ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారట.కానీ అల్లు అర్జున్ కూడా ఈ పాత్ర తనకి సెట్ అవ్వదని రిజెక్ట్ చేశారట. అలా చివరికి విజయ్ దేవరకొండ కి వచ్చి ఆయన స్టార్ హీరోగా మారారు.(7 years of Arjun Reddy)