The producer who tortured Kajal Aggarwal by asking her to wear a bikini

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. తన క్యూట్ నవ్వుతో ఎన్నో సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామగా బిరుదు సంపాదించింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ ఇప్పటికే ఎన్నో అవార్డులను తన నటనతో అందుకుంది.అయితే కాజల్ అగర్వాల్ ని ఓ ప్రొడ్యూసర్ పొట్టి పొట్టి బట్టలు వేసుకోని నా మూవీలో నటించు.. నీకు అవసరమైన డబ్బులు ఇస్తాను అంటూ బ్లాంక్ చెక్ ఇచ్చారట..

The producer who tortured Kajal Aggarwal by asking her to wear a bikini

ఇక విషయంలోకి వెళ్తే.. అప్పటివరకు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా మెయిన్ హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ మూవీలో మొదటిసారి నేను పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్ తో ఆడి పాడింది.అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి ఒప్పుకుందని ఎప్పుడైతే కాజల్ పేరు నెట్టింట్లో వైరల్ అయిందో అప్పటినుండి కాజల్ కి కొన్ని అలాంటి ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశాలు వచ్చాయట. (Kajal Aggarwal)

Also Read: Sai Pallavi: సాయి పల్లవికి ఆ హీరోయిన్ భర్త అంటే అంత ఇష్టమా..?

కానీ ఎన్ని డబ్బులు ఇస్తానని చెప్పినా కాజల్ మొహం మీదే రిజెక్ట్ చేసిందట.ఎందుకంటే కాజల్ కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే జనతా గ్యారేజ్ మూవీ లో ఐటమ్ సాంగ్ చేసిందట.అంతేగాని అన్ని సినిమాల్లో అలాంటి పాటలు చేయను అని క్లారిటీ ఇచ్చిందట. ఇక ఎన్టీఆర్,కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో టెంపర్, బృందావనం, బాద్ షా వంటి సినిమాలు వచ్చాయి.

The producer who tortured Kajal Aggarwal by asking her to wear a bikini

అందుకే ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం కారణంగానే జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పింద. అయితే ఈ విషయం తెలియని తమిళ ప్రొడ్యూసర్ కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ చూసి కాజల్ ఇంటికి వచ్చి మరీ బ్లాంక్ చెక్ ఇచ్చి మీరు నా సినిమాలో కాస్త పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ పాత్రలో నటిస్తే మీకు మీరు అడిగినన్ని డబ్బులు ఇస్తాను అని బ్లాంక్ చెక్ ఇచ్చారట.కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఆ తమిళ ప్రొడ్యూసర్ కి మొహం మీదే నటించను అని సున్నితంగా రిజెక్ట్ చేసి పంపించిందట.(Kajal Aggarwal)