Anna Canteens: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.వాస్తవానికి ఎన్నికల కంటే ముందు సూపర్ సిక్స్ పేరుతో కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది చంద్రబాబు నాయుడు కూటమి. అయితే కూటమి పార్టీలు ప్రకటించిన సంక్షేమ పథకాల నేపథ్యంలో ఏపీ ఓటర్లు వారి వైపు మొగ్గు చూపారు. Anna Canteens

Are the canteen plates being washed in dirty water

కానీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. కేవలం పెన్షన్ పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం… సూపర్ సిక్స్ గ్యారంటీలను మాత్రం గాలికి వదిలేసింది. బడ్జెట్లో కూడా వాటి ప్రస్తావన ఎక్కడ తేలేదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. Anna Canteens

Also Read: Raghurama Raju: చంద్రబాబుపై రఘురామ తిరుగుబాటు ?

అయితే వీటన్నిటిని పక్క దారి మళ్లించేందుకు అన్న క్యాంటీలను తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన 100 అన్న క్యాంటీన్ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వీటిని ప్రారంభించాడు. Anna Canteens

అయితే ఈ అన్న క్యాంటీన్ల విషయంలో తాజాగా ఒక వీడియో అందరినీ భయానికి గురిచేస్తుంది. తణుకు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ అన్నా క్యాంటీన్లో… చేతులు కడుక్కునే వాష్ బేషిన్ లో… తినే ప్లేట్లను కడుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. అయితే అది అన్నా క్యాంటీన్ లోనే జరిగిందా ? ఇతర వేరే ప్రాంతాలలో జరిగిన దాన్ని ఇలా చూపిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. Anna Canteens