Double ismart flop.. Puri Jagannadh wife fight

Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తో పూరి జగన్నాథ్ కెరీర్ మరింత దిగజారిపోయింది.ఆయన మెల్లిమెల్లిగా ఫ్లాప్ డైరెక్టర్ గా మారుతున్నారు.ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలను హీరోలకు అందించి స్టార్ హీరోలుగా మార్చారు. కానీ అలాంటిది ఈయన జీవితం ఒక్కసారి మారిపోతుంది. వరుసగా ఈయన తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో పూరి జగన్నాథ్ కెరీర్ ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఎంతో మంచి కథా కంటెంట్ తో వచ్చే పూరి జగన్నాథ్ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అని ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Double ismart flop.. Puri Jagannadh wife fight

అంతేకాదు హీరోలు సైతం ఎందుకు పూరి జగన్నాథ్ పరిస్థితి రోజురోజుకీ ఇలా దిగజారిపోతుంది అని ఆలోచన చేస్తున్నారట. అయితే రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి పూర్తిగా అప్పుల పాలయ్యారట. దీంతో ఈయన అప్పులు ఎలాగైనా త్వరలోనే కట్టేయాలని పూరి జగన్నాథ్ ఆలోచిస్తున్నారట. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు ముందు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వచ్చి పూరి జగన్నాథ్ ఆఫీసులో రచ్చ రచ్చ చేశారట. (Puri Jagannadh)

Also Read: 7years of Arjun Reddy: అర్జున్ రెడ్డి మూవీ ని రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోస్.?

తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేయడంతో పూరి జగన్నాథ్ తాను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఒక ఖరీదైన ఫ్లాట్ ని అమ్మకానికి పెట్టి అది అమ్మితే వచ్చిన డబ్బులతో డిస్ట్రిబ్యూటర్ల అప్పులని తీర్చేసారట. ఇక విషయంలోకి వెళ్తే..లైగర్ సినిమా వల్ల పూరి జగన్నాథ్ పై చాలా దెబ్బ పడింది.ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు ఈయన ఆఫీసు ముందు గోల చేశారు.

Double ismart flop.. Puri Jagannadh wife fight

ఇక తనకి ఉండే అప్పులను శంషాబాద్లో ఉన్న ఒక ఖరీదైన ఫ్లాట్ ని అమ్మేసి అది అమ్మగా వచ్చిన 18 కోట్లతో అప్పులు తీర్చేశారట. ఇక త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ నష్టాలను కూడా పూడ్చాలని పూరి జగన్నాధ్ అనుకుంటున్నారాట.ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఆయన భార్య లావణ్య కి గొడవ జరుగుతుందట. దానికి కారణం పూరి లగ్జరీ ఫ్లాట్ ని అమ్మేయడమే.. సినిమా కి వచ్చిన నష్టాల వల్ల ఖరీదైన ఫ్లాట్ ని అమ్మేయడంతో పూరి జగన్నాథ్ తో ఆయన భార్య లావణ్య గొడవ పెట్టుకుందట.ప్రస్తుతం ఇదే న్యూస్ టాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.(Puri Jagannadh)