Ester Noronha viral comments on Noel

Ester Noronha: సింగర్ నోయల్ నటి ఎస్తేర్ ల ప్రేమ, వివాహం చాలా విచిత్రంగా జరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకొని కనీసం సంవత్సరం కూడా కలిసి ఉండలేదు. పెళ్లయిన 16 రోజులకే ఎస్తేర్ నోయల్ కి గుడ్ బై చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఏ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా కచ్చితంగా తన విడాకుల ప్రశ్న ఎదురవుతుంది. ఇక ఈ విడాకుల విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు నోయల్ కు సంబంధించిన సీక్రెట్ విషయాలన్ని బయటపెట్టింది.

Ester Noronha viral comments on Noel

ఇక తాజాగా కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్తేర్ మాట్లాడుతూ.. చూడడానికి బయటికి అందరూ బాగానే ఉంటారు. కానీ వాళ్లతో జీవితం పంచుకునే వారికే అసలు నిజం తెలుస్తుంది. నేను కూడా మొదట్లో ఈ విషయం కామన్ గా తీసుకొని క్షమించి వదిలేసాను.కానీ ఆయనని ఎన్నిసార్లు క్షమించినా కూడా పద్ధతి మార్చుకోలేదు. అయితే ప్రతిసారి ఇలా క్షమించుకుంటూ పోతే నా క్షమాగుణాన్ని బలహీనతనగా తీసుకొని పదే పదే అదే తప్పు చేస్తుంటే కావాలనే ఆ వ్యక్తి మనపై గేమ్ ప్లే చేస్తున్నాడని అర్థమవుతుంది.నాకు కూడా అదే అర్థమైంది.(Ester Noronha)

Also Read: Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్.. పూరి జగన్నాథ్ తో భార్య గొడవ..?

అందుకే సమాజం ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు అని వెంటనే పేరెంట్స్ దగ్గరికి వచ్చేసాను. అయితే నా పేరెంట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. ఇక ఈ విషయంలో నా పేరెంట్స్ కి ఈ విషయం చెప్పినా కూడా వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. ఎందుకంటే అలాంటి వ్యక్తితో జీవితాంతం లైఫ్ నీ పంచుకోవడం కంటే ఒంటరిగా ఉండడం మేలు. అని చెప్పింది ఎస్తేర్.

Ester Noronha viral comments on Noel

ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో నోయల్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే తనకి దూరంగా వచ్చేసానని చెప్పింది. కానీ నోయల్ మాత్రం బిగ్ బాస్ షో కి వెళ్ళినప్పుడు ఎస్తేర్ ని తలుచుకొని ఓ పాట రూపంలో పాడి ఎమోషనల్ అయ్యాడు. అయితే దీని గురించి కూడా ఎస్తేర్ స్పందించి అదంతా దొంగ నాటకం..ఫేమస్ అవ్వడం పబ్లిసిటీ కోసమే ఇలా చేశాడని చెప్పింది.(Ester Noronha)