Venu Swamy was caught with black magic on him..with proofs

Venu Swamy: వేణు స్వామి తప్పుడు పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ తాజాగా టీవీ5 మూర్తి తన అనుచరుడు అంటూ అమర్ ఓ అమ్మాయితో వేణు స్వామి 5 కోట్లు మూర్తి ఇవ్వమన్నాడు అంటూ ఒక ఆడియో కాల్ రికార్డింగ్ ఈ మధ్యకాలంలో ఎంత దుమారం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈ ఆడియో కాల్ నెట్టింట వైరల్ అవ్వడంతో వెంటనే ఈ ఆడియో కాల్ మీద స్పందించిన మూర్తి త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతానని రీసెంట్ గా అమర్ అనే వ్యక్తి తన తన అనుచరుడని చెప్పుకున్న అమర్ అనే వ్యక్తిని మీడియా లైవ్ లోకి తీసుకువచ్చారు.

Venu Swamy was caught with black magic on him..with proofs

అయితే లైవ్ లోనే అమర్ ఫోన్ లో మాట్లాడుతూ.. అసలు నాకు మీరు ఎవరో తెలియదు.కానీ కీర్తి రెడ్డి అనే వేణు స్వామి సన్నిహితురాలు నాతో దాదాపు 8 చానల్స్ కి సంబంధించిన ఆడియో కాల్ రికార్డ్స్ చేయించింది అని చెప్పాడు.ఇక దీనికి మూర్తి ఏ ఛానల్ అవసరం వస్తే ఆ ఛానల్ ని ఇరికిద్దామని వేణు స్వామి ఇలా చేయించాడు అని అన్నారు..అంతే కాదు అమర్ ఇంకా మాట్లాడుతూ.. నేను కొద్ది రోజులు ఈ పని చేశాక అసలు విషయం తెలిసి మానేద్దాం అనుకున్నాను. (Venu Swamy)

Also Read: Venu Swamy: టీనేజ్ అమ్మాయిలతో న** పూజలు.. వేణు స్వామి సీక్రెట్ వ్యవహారం.?

కానీ ఆ టైంలో కీర్తి రెడ్డి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నీ కుటుంబం నువ్వు బాగుండాలని అనుకోవడం లేదా.. నువ్వు చెప్పినట్టు వినకపోతే వేణు స్వామి నిన్ను నీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసి పడేస్తాడు. ఇప్పటికే మూర్తిపై క్షుద్ర పూజలు చేస్తున్నాడు.చేతబడి బాణామతి వంటివి ఏమేమో మాట్లాడింది.దాంతో నేను చాలా భయభ్రాంతులకు గురయ్యాను. నన్ను ఓ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్లి మంచు విష్ణుతో ఫిలిం జర్నలిస్ట్ ల విషయం మాట్లాడి ఫిలిం ఛాంబర్ లో తనపై ఎలాంటి ఇష్యూ రాకుండా చూసుకోవాలని చెప్పమన్నాడు..

Venu Swamy was caught with black magic on him..with proofs

అంటూ అమర్ ఫోన్ లైవ్ లోనే అన్ని విషయాలను బయటపెట్టాడు. దీంతో నా పైన క్షుద్ర పూజలు చేయించినా.. చేతబడి చేయించినా.. నేను భయపడేది లేదు. నాపై ఒకసారి నిందపడితే నేను దేనికి భయపడను. దేనికి తలవంచను.. రాహుల్ గాంధీ, మోడీ లనే టార్గెట్ చేసిన వాడిని వేణు స్వామికి భయపడతానా అని మూర్తి చెప్పారు.(Venu Swamy)