Congress: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత… ఏపీ రాజకీయాలు తెలంగాణలో కూడా కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచిన నేతలు మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలా ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. Congress

Congress workers attack Chevella MLA Kale Yadaiah with eggs over party switch

అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలపై… తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు వెళ్లడంతో.. అందులో ఉన్న కాంగ్రెస్ నేతలు తీవ్రంగా.. చేరిన ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్నారు. కడియం శ్రీహరి నుంచి మొదలు పెడితే… కాలే యాదయ్య వరకు.. అందరూ నిరసన సెగను ఎదుర్కొంటున్నారు. Congress

Also Read: MLA Bolisetty Srinivas: అల్లు అర్జున్ ఓ పిల్ల బచ్చా.. ఆయనకు ఫ్యాన్సీ లేరు..?

అయితే తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కు కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బుధవారం రోజున… కాలే యాదయ్య కాన్వాయ్ ని అడ్డుకొని కోడిగుడ్లు కూడా కొట్టారు కాంగ్రెస్ నేతలు. పోలీసులు అడ్డు వచ్చినా కూడా కాంగ్రెస్ నేతలు తగ్గలేదు. కాలే యాదయ్య పై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. Congress

దీంతో ఈ సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది. ఇక అటు జగిత్యాల నియోజకవర్గం లో కూడా.. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు అడుగడుగున… అడ్డు తలుగుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లోకి వెళ్లిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ.. కెసిఆర్ చెంతకు చేరాలని అనుకుంటున్నారట. Congress