Pooja Hegde who secretly went there with her boyfriend

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతోంది.. మొదట్లో ఇంటి దాకా వచ్చిన అవకాశాలను కాళ్లతో తన్ని బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇక బాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలు అట్టర్ ప్లాప్ అవ్వడంతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీ నే దిక్కు అన్నట్లు ఏ అవకాశాలు అయితే వద్దందో మళ్ళీ అవే అవకాశాల కోసం వెతుకులాడుతుంది. (Pooja Hegde)

Pooja Hegde who secretly went there with her boyfriend

ప్రస్తుతం ఈమె చేతిలో తమిళ్ హీరో సూర్య చేస్తున్న ఓ ప్రాజెక్టు ఉంది.అలాగే సాయిధరమ్ తేజ్ తో గంజా శంకర్ ఉన్నప్పటికీ ఈ సినిమా కొన్ని వివాదాల కారణంగా షూటింగ్ జరగడం లేదు. ఇక గుంటూరు కారం సినిమాలో శ్రీలీల పోషించిన పాత్రని మొదట రిజెక్ట్ చేసింది పూజా హెగ్డే. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా లేట్ అవ్వడంతో ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది.(Pooja Hegde)

Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా ముత్యాల దండ ధర తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..?

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఈ హీరోయిన్ కి అంతగా అవకాశాలు లేవు. ఇక అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం చుట్టేయాలిని నిర్ణయం తీసుకుందో ఏమో కానీ రీసెంట్గా అమెరికా వెళ్లి అక్కడే ఉంది. ఇక తాజాగా పూజ హెగ్డే లాస్ ఏంజెల్స్ కి వెళ్లి అక్కడ దిగిన కొన్ని ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

Pooja Hegde who secretly went there with her boyfriend

అయితే ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్స్ పూజ హెగ్డే తన ప్రియుడు రోహన్ మెహ్రా తోనే వెకేషన్ కి వెళ్ళింది అని కామెంట్లు పెడుతున్నారు.అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా తో పూజ హెగ్డే ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.(Pooja Hegde)