Nithiin who is going to be a father

Nithiin: తెలుగు టైర్ టు హీరోల్లో ఒకరైన నితిన్ తండ్రి కాబోతున్నట్టు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే నితిన్ తండ్రి కాబోతున్నాడు అంటూ చాలాసార్లు ఈ వార్తలు వినిపించాయి. శాలిని,నితిన్ తల్లిదండ్రులు కాబోతున్నారని గత ఏడాది కూడా ఈ వార్త వినిపించినప్పటికీ ఇందులో ఎలాంటి నిజం లేదు.అయితే తాజాగా నితిన్ షాలిని దంపతులు పేరెంట్స్ కాబోతున్నారంటూ మరో వార్త మీడియాలో వైరల్ గా మారడంతో ఇది నిజమే కావచ్చు

Nithiin who is going to be a father

అని నితిన్ అభిమానులు తెగ సంబరపడుతూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నితిన్ తండ్రి కావడమే కాదు పుట్టబోయే బిడ్డ కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఓ వార్త వినిపిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. కరోనా సమయంలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్న చేసుకున్నారు నితిన్ శాలిని.. ( Nithiin)

Also Read: Sandeep Kishan: హీరోయిన్ కి మించిన అందంతో సందీప్ పక్కన ఉన్న అమ్మాయి.. ఎవరంటే.?

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్న నితిన్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీతో మన ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన తమ్ముడు అలాగే రాబిన్ హుడ్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. నితిన్ రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే..

 Nithiin who is going to be a father

త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడట. వీరికి త్వరలోనే ఓ పండంటి బిడ్డ పుట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పుట్టబోయే బిడ్డ కోసం నితిన్ దాదాపు రెండు నెలలు సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా తన భార్యతోనే టైం స్పెండ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో నితిన్ బిడ్డ పుట్టక ముందే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.( Nithiin)