NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. కూటమి ప్రభుత్వంలో… తెలుగుదేశం నేతలకు.. ఎక్కువ పోస్టులు ఇచ్చేలా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరికి కీలక పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. NTR

Check for Junior NTR Chandrababu huge sketch

అలాంటి వారిలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కి కీలక పదవి ఇచ్చి… నందమూరి హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని అనుకుంటున్నారట చంద్రబాబు నాయుడు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉండకుండా చేస్తున్నారట. సుహాసిని కి పదవి ఇస్తే… నందమూరి కుటుంబానికి న్యాయం చేసినట్లు ఉంటుందని… జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టవచ్చని చంద్రబాబు ఆలోచన. NTR

Also Read: Sai Dharam Tej: గర్ల్స్ కాలేజీ బాత్ రూమ్ ల్లో సీక్రెట్ కెమెరా.. అడ్డంగా ఇరుక్కున్న మెగా హీరో?

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన రాజ్యసభ పదవులు రెండు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక స్థానంలో సుహాసినిని పంపించాలని అనుకుంటున్నారట. ఈ మేరకు నందమూరి హరికృష్ణ కుటుంబంతో చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. NTR

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణలోని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సుహాసినికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ ఎన్నికల్లో సుహాసిని దారుణంగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఈ రాజ్యసభ పదవితో… మళ్లీ ఆమెకు న్యాయం చేయాలని అనుకుంటున్నారట. NTR