Rajinikanth connection with Silk Smitha death.. The secret revealed

Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ అంటే తెలియని వారు ఉండరు.ఈయన తన సినిమాలతో 70 ఏళ్ల పైబడినా కూడా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందిస్తున్నారు. అయితే అలాంటి ఈ హీరోకి సిల్క్ స్మిత మరణంతో ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తారగా పేరు తెచ్చుకున్న వారిలో సిల్క్ స్మిత ఒక్కరు. అప్పట్లో సిల్క్ స్మిత ఎన్నో హిట్ సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో నటించింది.

Rajinikanth connection with Silk Smitha Death.. The secret revealed

అలాగే ఐటెం సాంగ్స్ కి సిల్క్ స్మిత పెట్టింది పేరుగా ఉండేది. అలాగే ముద్దుగుమ్మ కి అప్పట్లో ఎంతో మంది అభిమానులు ఉండేవారు. కేవలం కుర్ర కారు మాత్రమే కాదు ఏ ఏజ్ వారైనా సరే సిల్క్ స్మిత అందానికి ఫిదా అవ్వాల్సిందే.అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత చిన్న వయసులోనే అనుమానాస్పద స్థితిలో మరణించింది.ఈమె మరణం ఎంతో మందిని కలిచి వేసింది. (Rajinikanth)

Also Read: Nithiin: తండ్రి కాబోతున్న నితిన్.. బిడ్డ పుట్టక ముందే సంచలన నిర్ణయం..?

అయితే అలాంటి సిల్క్ స్మిత మరణానికి కారణం ఇప్పటివరకు బయటపడలేదు.కానీ అప్పట్లో ఈమె మరణానికి ఇండైరెక్ట్ గా రజినీకాంత్ కూడా ఒక కారణం అంటూ మీడియాలో వార్తలు వినిపించాయి. దానికి కారణం అప్పట్లో రజినీకాంత్ సిల్క్ స్మిత మధ్య డేటింగ్ వార్త చక్కర్లు కొట్టాయి.వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. అంతేకాకుండా రజినీకాంత్ కి సిల్క్ స్మిత అంటే అపారమైన ప్రేమ అనే టాక్ కూడా అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది.

Rajinikanth connection with Silk Smitha death.. The secret revealed

అయితే సిల్క్ స్మిత మరణానికి కొద్ది సంవత్సరాల ముందు రజినీకాంత్ సిల్క్ స్మితాను పట్టించుకోవడం మానేశారట. ఇక ఆయన మాట్లాడకపోవడంతో సిల్క్ స్మిత కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళిందని మద్యానికి కూడా బానిసైందనే టాకీ వినిపించింది ఆ తర్వాత కొద్ది రోజులకే సిల్క్ స్మిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. దాంతో అప్పట్లో కొంతమంది సిల్క్ స్మిత మరణానికి పరోక్షంగా రజినీకాంత్ కూడా కారణమయ్యారని మాట్లాడుకున్నారు.(Rajinikanth)