Chiranjeevi desire with Balakrishna be fulfilled

Chiranjeevi: తాతమ్మకల మూవీతో బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు కలిసి బాలకృష్ణకు సంబంధించిన 50 ఏళ్ల సినీ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇక బాలకృష్ణ కి ఘనంగా సన్మానం చేయడం కోసం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఎంతోమంది సినీ ప్రముఖులను ఆహ్వానించారు.

Chiranjeevi desire with Balakrishna be fulfilled

అలా చిరంజీవి,మోహన్ బాబు, కమల్ హాసన్,అల్లు అర్జున్,వెంకటేష్ లతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందులో భాగంగా చిరంజీవి స్టేజ్ పై మాట్లాడుతూ.. బాలకృష్ణతో తనకి ఉన్న ఒక కోరికని బయట పెట్టారు. అదేంటంటే.. చిరంజీవి ఇంద్ర మూవీ చేయడానికి ప్రధాన కారణం బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమనట.(Chiranjeevi)

Also Read: Rajinikanth: సిల్క్ స్మిత మరణంతో రజినీకాంత్ కి సంబంధం.. బయటపడ్డ రహస్యం.?

ఈ సినిమాలో ఫ్యాక్షనిజం నచ్చి చిరంజీవి కూడా ఇంద్ర సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారట.అయితే బాలకృష్ణతో తనకి ఓ కోరిక ఉందని,అదేంటంటే.. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే ఓ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాలని ఉంది అంటూ తన కోరికను బహిరంగంగానే ఆ ఈవెంట్లో బయటపెట్టారు చిరంజీవి.ఇక ప్రస్తుతం చిరంజీవికి ఉన్న కోరిక విని చాలా మంది నెటిజన్స్ బాలకృష్ణ చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలే..

Chiranjeevi desire with Balakrishna be fulfilled

రికార్డులు తిరిగి రాయడమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అయితే వీరి కాంబినేషన్లో సినిమా చేయాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఇద్దరు పెద్ద హీరోలే.. ఇద్దరు హీరోల అభిమానులను సాటిస్పై చేయాలంటే కచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సినిమా చేయాల్సి ఉంటుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేసే ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.(Chiranjeevi)