Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైడ్రా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చెరువులను అలాగే, నాలాలను కబ్జాచేసి ఇండ్లు అలాగే ఫామ్ హౌస్ లు కట్టుకున్న వారికి నోటీసులు ఇచ్చి… ధ్వంసం చేస్తోంది హైడ్రా. అయితే… ఇప్పటికే అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను పెద్ద హడావిడి చేసింది హైడ్రా. Etela Rajender

Etela Rajender counter to prof nageshwar rao

అక్కినేని నాగార్జున ఎపిసోడ్ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ ఏ వ్యక్తిని కూడా ముట్టుకోలేదు హైడ్రా. కానీ గులాబీ అలాగే బీజేపీ నేతలకు నోటీసులు మాత్రం ఇచ్చి హడావిడి చేసింది. అయితే ఈ హైడ్రా కారణంగా… పేద ప్రజల ఇండ్లను కూల గొడుతున్నారు అధికారులు. బోయిన్పల్లి, దిల్షుక్నగర్, పంజాగుట్ట లోని బస్తీలు… ఇలా చెప్పుకుంటూ పోతే పేదల ఇండ్లను ధ్వంసం చేసింది హైడ్రా. Etela Rajender

Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ కు చెక్.. చంద్రబాబు భారీ స్కెచ్?

అయితే హైడ్రా చర్యలను ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నారు. సామాన్యులకు అన్యాయం జరుగుతే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు ఈటెల. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాత్రం… ఈటెల అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా చేస్తున్న పని మంచిదని కొనియాడుతున్నారు. బిజెపి అధ్యక్ష పదవి రాకపోవడంతో.. ఈటెల ప్రక్సేషన్ మాట్లాడుతున్నాడని ప్రొఫెసర్ నాగేశ్వరరావు సెటైర్లు వేశారు. Etela Rajender

అయితే దీంతో భగ్గుమన్న ఈటల రాజేందర్.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పరువు తీశాడు. ఎప్పుడైనా కాలనీలు జనాల్లోకి వెళ్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అసలు విషయం తెలుస్తుందని చురకలాంటించారు. కానీ బిల్డింగ్లలో ఉండే వారికి ప్రజల కష్టాలు తెలువని… హైడ్రా చేస్తున్న దౌర్జన్యాలు గుర్తుకు రావన్నారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. Etela Rajender