Umpire Anil Chaudhary: భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడని పేర్కొన్నారు అంపైర్ అనిల్ చౌదరి. తన అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. కాలు కదపకుండానే అలవోకగా భారీ సిక్సర్లు కొడుతూ ఉంటాడు. ఫుల్ షాట్ ఆడితే ఆ బంతి ఇక స్టాడ్స్ లోకే వెళుతుంది. Umpire Anil Chaudhary

Umpire Anil Chaudhary tells that Rohit Sharma

ఈ మధ్య టీమిండియాను పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ పై అంపైర్ అనిల్ చౌదరి సంచలన కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ చాలా తెలివైన క్రికెటర్. అతడికి క్రికెట్ ఐక్యూ చాలా ఎక్కువ అని అనిల్ వెల్లడించడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి అంపైరింగ్ ప్యానెల్ లో ఒకరైన అనిల్ చౌదరి తాజాగా పోడ్ కాస్ట్ లో మాట్లాడారు. Umpire Anil Chaudhary

Also Read: Nathan Bracken: ఒకప్పుడు తోపు బౌలర్.. ఇప్పుడు అకౌంటెంట్‌గా మారాడు ?

తన అంపైరింగ్, కెరీర్ గురించి…. మైదానంలో తాను చూసిన గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడాడు. తాను చూసిన గొప్ప ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరని, రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేశారు. మనకు మైదానంలో రోహిత్ శర్మ చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ రోహిత్ శర్మ చాలా తెలివైన క్రికెటర్. రోహిత్ శర్మ చాలా స్మార్ట్. అతడికి క్రికెట్ ఐక్యూ చాలా ఎక్కువ అని అన్నాడు. అంతేకాదు రోహిత్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతడి ఆలోచన శక్తిని అంచనా వేయడం చాలా కష్టమని అనిల్ తెలిపాడు. Umpire Anil Chaudhary