Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.గత మూడు రోజులుగా తెలంగాణ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. అసలు మూడు రోజులుగా ఎక్కడ కూడా వర్షం ఆగడం లేదు. దీంతో విజయవాడ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పూర్తిగా మునిగిపోయాయి. Revanth Reddy

Revanth Reddy kompamunchina Chandrababu

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాణనష్టం అదే సమయంలో ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. అయితే ఈ వరదలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగానే అలర్ట్ అయ్యారు. ఆదివారం రోజున నిద్రపోకుండా విజయవాడ ప్రజల కోసం పనిచేశారు చంద్రబాబు నాయుడు. Revanth Reddy

Also Read: Etela Rajender: ఈటల వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. ఏందయ్యా ఈ రచ్చ?

ప్రత్యేకంగా హెలిక్యాప్టర్లు తీసుకువచ్చి ప్రజలకు ఫుడ్ అందిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారు. అయితే ఖమ్మం జిల్లా ప్రజలు వరదలు చిక్కుకున్న కూడా.. సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారు. అసలు ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి.అటు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి హైదరాబాదులోనే ఆదివారం సాయంత్రం వరకు ఉన్నారు. Revanth Reddy

సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో.. వెంటనే ఖమ్మం జిల్లాలో పర్యటించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కాంగ్రెస్ నేతలపై ఖమ్మం ప్రజలు తిరుగుబాటు చేశారు. అయితే.. 70 సంవత్సరాలకు పైగా ఉన్న చంద్రబాబు నాయుడు రాత్రంతా కష్టపడుతుంటే.. 50 ఏళ్లు దాటిన రేవంత్ రెడ్డి మాత్రం.. హైదరాబాదులోనే ఉండడం దారుణమని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. చంద్రబాబును చూసుకొని నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. Revanth Reddy