The director who insulted Venkatesh

Venkatesh: దగ్గుబాటి వెంకటేష్ కి యాక్టింగ్ రాదంటే చాలామంది నవ్వుకుంటారు. అంత పెద్ద యాక్టర్ కి యాక్టింగ్ రాదని అలా పిచ్చికూతలు కూసింది ఎవరు అని తిట్టుకుంటారు కూడా..ఎందుకంటే వెంకటేష్ యాక్టింగ్ అలా ఉంటుంది మరి..వెంకటేష్ ఏ జానార్లో అయినా సరే నటన ఇరగదీస్తారు. కామెడీ అయినా ఎమోషన్స్ అయినా ఏ మూవీ అయినా సరే ఇట్టే పాత్రలో ఒదిగిపోతారు.

The director who insulted Venkatesh

అయితే అలాంటి వెంకటేష్ ని నటన రాదు ఏం రాదు అంటూ అసహ్యించుకొని తన కళ్ళజోడు సైతం నేలకు విసిరికొట్టి ఇంటికి వెళ్లారట ఓ స్టార్ డైరెక్టర్.ఆయన ఎవరో కాదు రాఘవేందర్రావు.. వెంకటేష్ హీరోగా చేసిన మొదటి మూవీకి రాఘవేందర్రావు దర్శకత్వ వహించారు. కలియుగ పాండవులు సినిమా చేసే సమయంలో వెంకటేష్ కి అదే మొదటి సినిమా కావడంతో తన యాక్టింగ్ ఓ సీన్లో సరిగ్గా పండలేదట. (Venkatesh )

Also Read: Rajinikanth: సిల్క్ స్మిత మరణంతో రజినీకాంత్ కి సంబంధం.. బయటపడ్డ రహస్యం.?

దాంతో ఎన్నిసార్లు షూట్ చేసినా కూడా వెంకటేష్ మొహంలో ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ కనిపించక పోయేసరికి రాఘవేంద్రరావు వెంటనే తన కళ్ళజోడు నేలకు విసిరికొట్టి అక్కడి నుండి వెళ్లిపోయారట. ఆ తర్వాత అసలు విషయం తెలిసి రామానాయుడు షూటింగ్ స్పాట్ కి వచ్చి రాఘవేంద్ర రావుకి నచ్చజెప్పారట. ఇదే మొదటి సినిమా కదా..కాస్త ఓపిక పట్టుకొని డైరెక్షన్ చేయండి అని చెప్పారట.

The director who insulted Venkatesh

దాంతో రాఘవేంద్రరావు కాన్విన్స్ అయ్యి మళ్ళీ వెంకటేష్ తో సినిమా తీశారట.అలా ఈ సినిమా విడుదలయ్యాక ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.ఇక మొదటి సినిమా సమయంలోనే రాఘవేంద్రరావు తో చివాట్లు తిన్న వెంకటేష్ ఆ తర్వాత సినిమా సినిమాకి తన నటన మెరుగుపరుచుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.(Venkatesh )