What is the link between the birth of Balakrishna-Rana

Balakrishna-Rana: నందమూరి బాలకృష్ణకి దగ్గుబాటి రానా పుట్టుకకి మధ్య ఉన్న లింకేంటి.. అనేది చాలామందికి తెలియని సీక్రెట్..మరి ఇంతకీ వీరిద్దరి మధ్య ఉన్న రహస్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు కలిసి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాలకృష్ణ కోసం ఎంతో మంది సెలబ్రెటీలను ఆహ్వానించి బాలకృష్ణ కు ఘనంగా సన్మానం చేశారు.

What is the link between the birth of Balakrishna-Rana

ఇక ఇందులో చిరంజీవి,మోహన్ బాబు, అల్లు అర్జున్,మంచు విష్ణు,నాని, రానా,సిద్దు జొన్నలగడ్డ,విశ్వక్ సేన్ వంటి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో దగ్గుబాటి రానా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు. మరి ఇంతకీ ఆ ఆసక్తికరమైన విషయం ఏంటయ్యా అంటే.. (Balakrishna-Rana)

Also read: Chiranjeevi: బాలకృష్ణతో చిరంజీవికి ఉన్న ఆ కోరిక తీరేదెన్నడో.?

నందమూరి బాలకృష్ణ కి సంబంధించిన ఒక సినిమా విడుదలైన రోజే దగ్గుబాటి రానా కూడా పుట్టారట. అయితే ఈ విషయాన్ని తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకల నేపథ్యంలో జరిగిన ఈవెంట్లో దగ్గుబాటి రానా బయటపెట్టారు. నేను బాలకృష్ణ నటించిన సినిమా విడుదలైన రోజే పుట్టాను. కాబట్టి నాకు కూడా బాలకృష్ణ లాగే అన్ని రకాల చిలిపి పనులు వచ్చాయి.

What is the link between the birth of Balakrishna-Rana

అందుకే నేను కూడా స్టేజ్ మీద ఎన్నో చిలిపి పనులు అల్లరి పనులు చేస్తూ ఉంటాను. అంటూ రానా సరదాగా చెప్పారు.ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో రానా పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఈ విషయం ఎక్కడా కూడా రానా బయట పెట్టలేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ సినీ ఈవెంట్లో ఈ విషయం బయటపడింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Balakrishna-Rana)