The star Hero who lost his eye sight for the film.

Hero: సినిమాల కోసం చాలామంది నటీనటులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.ఇండస్ట్రీకి రావడం కోసం డబ్బులు పెట్టుబడుగా పెట్టడమే కాదు ఒళ్లును కూడా అమ్ముకుంటారు.అలాంటి సినీ యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు.ఇక సినిమా షూటింగ్స్ సమయంలో కొంతమంది ప్రాణాలను సైతం అర్పించిన వాళ్ళు ఉన్నారు. భారీ భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించినప్పుడు కాళ్లు,చేతులు వంటివి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా కొనసాగుతున్న ఓ హీరో కూడా ఓ సినిమా కోసం తన కంటి చూపును సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

The star Hero who lost his eye sight for the film.

మరి ఆ హీరో ఎవరు.. ఎందుకు కంటిచూపు పోయే స్థితికి వచ్చాడు అనేది ఇప్పుడు చూద్దాం.. తమిళ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరో. ఈయన చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. ఇక తాజాగా తంగలాన్ మూవీతో హిట్టు కొట్టిన విక్రమ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.విక్రమ్ ఓ సినిమాలో నటించి తన కంటి చూపును కోల్పోయే స్టేజికి వచ్చారట.(Hero)

Also Read: Balakrishna-Rana: బాలకృష్ణ కి రానా పుట్టుకకి మధ్య ఉన్న లింక్ ఏంటి..?

ఇక విక్రమ్ నటించిన ఆ సినిమా ఏదో కాదు కాశి.ఈ సినిమా తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కథానాయకుడిగా చేసిన శ్రీను వాసంతి లక్ష్మి మూవీ గా విడుదలైంది.. అయితే కోలీవుడ్లో కాశీ మూవీలో హీరోగా నటించిన విక్రమ్ అంధుడి పాత్రలో నటించాలి కాబట్టి ఈ సినిమా షూటింగ్ సమయంలో తన కళ్ళు పైకెత్తి చాలాసేపు చూసేసరికి కళ్ళు పోయే స్టేజ్ కి వచ్చాడట. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లగా మీకు మెల్ల వస్తుంది. చూపు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది అని హెచ్చరించారట.

The star Hero who lost his eye sight for the film.

కానీ దానికి తగ్గ మందులు వాడుకోవడంతో ఆ ప్రమాదం నుండి బయట పడ్డట్టు విక్రమ్ తెలియజేశారు.ఇవిక్రమ్ కేవలం కాశీ మూవీ మాత్రమే కాదు ఆయన ఎన్నో డిఫరెంట్ జానర్లలో సినిమాలు తీస్తూ ఉంటారు.అలా ఐ సినిమాలో విక్రమ్ అభినయం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా విక్రమ్ శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న,రీసెంట్ గా వచ్చిన తంగళాన్ వంటి డిఫరెంట్ మూవీస్ లో నటించారు.(Hero)