Will this hot anchor be Jr.NTR younger sister

Jr.NTR: ఏంటి ఆ హాట్ యాంకర్ నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కి సిస్టర్ అవుతుందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ కి అసలు చెల్లెళ్లు లేరు. ఆయనకు నందమూరి సుహాసిని అనే అక్క ఉంది.. అలాగే కళ్యాణ్ రామ్,జానకి రామ్ అనే సోదరులు ఉన్నారు. ఇందులో పెద్దన్నయ్య జానకిరామ్ మరణించారు..

Will this hot anchor be Jr.NTR younger sister

కానీ సడన్ గా ఎన్టీఆర్ కి చెల్లెలు ఎక్కడినుండి పుట్టుక వచ్చింది అని ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఎన్టీఆర్ చెల్లెలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నిజంగా ఎన్టీఆర్ చెల్లెలు కాదు.ఆమె రీల్ లైఫ్ లో అంటే సినిమాలో చెల్లెలుగా నటించింది.ఇక ఆమె ఎవరో కాదు యాంకర్ మంజూష.. తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో కేవలం యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మంజూష జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన రాఖీ మూవీలో ఆయనకి సోదరి పాత్రలో నటించింది.( Jr.NTR)

Also Read: Rashmi: పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మీ.. కొత్త ప్రయాణం అంటూ పోస్ట్.. వరుడు అతడే.?

ఇక ఈ సినిమాలో మంజూష పాత్రనే చాలా కీలకంగా ఉంటుంది. మంజూష కోసమే ఎన్టీఆర్ అలా తయారవుతారు. అందుకే ఈ సినిమా పేరు రాఖీ అని పెట్టారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ అంచనాలు మించి హిట్ అవ్వలేకపోయింది. అయితే అలాంటి ఈ సినిమా లో ఎన్టీఆర్ కి చెల్లెలుగా నటించిన యాంకర్ మంజూష ప్రస్తుతం హాట్ యాంకర్ గా మారిపోయింది.

Will this hot anchor be Jr.NTR younger sister

ఈమె జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫోటోలు వీడియోలు అలాగే అప్పుడప్పుడు ట్రెండీ వేర్ వేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కుర్ర కారును తెగ అట్రాక్ట్ చేస్తాయి. దాంతో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో కొంతమంది నెటిజన్స్ ఎన్టీఆర్ చెల్లెలు చూడండి ఎంత హాట్ గా మారిపోయిందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.( Jr.NTR)