Directors saying get ready fans.. Fix the moment for Chiru Balayya combo Movie

Movie: కొణిదెల చిరంజీవి,నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అని అనుకోని అభిమానులు ఉండరు. వీరి కాంబోలో సినిమా వస్తే ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషనే అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి వీరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే మొదటిసారి చిరంజీవి తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు.

Directors saying get ready fans.. Fix the moment for Chiru Balayya combo Movie

నాకు బాలకృష్ణతో ఓ సినిమాలో నటించాలనుంది..మా ఇద్దరి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ వస్తే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఈ విషయంపై బాలకృష్ణ కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఎన్నో గొడవలు వస్తాయి.ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలలో ఎవరిని తక్కువగా చేసి చూపించినా కూడా అభిమానులు అస్సలు ఊరుకోరు.(Movie)

Also Read: Simran: సిమ్రాన్ పై మోజు పడ్డ స్టార్ హీరో.. కానీ హీరోయిన్ చేసిన పనికి..?

అందుకే వీరిద్దరికీ తగ్గట్టు ఉండే కథను ఎంచుకోవాలి. అయితే తాజాగా ఓ ఇద్దరు డైరెక్టర్లు బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా తీయడానికి రెడీ అయిపోతున్నట్టు తెలుస్తోంది.ఇక వాళ్ళు ఎవరో కాదు..బోయపాటి శ్రీను, హరీష్ శంకర్..(Movie)

Directors saying get ready fans.. Fix the moment for Chiru Balayya combo Movie

ఎప్పుడైతే చిరంజీవి బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది అని ఆయన మనసులో మాట బయటపెట్టారో అప్పటినుండి హరీష్ శంకర్, బోయపాటి శ్రీనులు ఎవరికి వారే వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం కథలు రాసుకుంటున్నారట. ఇద్దరు కథలు రాసుకున్నప్పటికీ ఏ డైరెక్టర్ కథ బాగుంటే ఆ డైరెక్టర్ తో చిరంజీవి, బాలకృష్ణల మల్టీస్టారర్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.మరి వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకి డైరెక్టర్ ఆఫర్ కొట్టేసే ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.(Movie)