Emotional Significance Behind Akkineni Family Names

Akkineni Family: అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభాలలో ఒకరు. ఆయన తరువాత, ఆయన కుటుంబం వారసత్వాన్ని కొనసాగిస్తోంది. నాగార్జున నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతుండగా, ఆయన కుమారులు నాగ చైతన్య మరియు అఖిల్ స్టార్ హీరోలుగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏఎన్నార్ తన కుటుంబం గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Emotional Significance Behind Akkineni Family Names

తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఇష్టానుసారంగా పేర్లు పెట్టే అలవాటు ఉన్నప్పటికీ, అక్కినేని ఇంటి పేరు వెనుక ప్రత్యేకమైన భావోద్వేగం ఉందని నాగేశ్వరరావు స్వయంగా ఈ విషయం వివరించారు. అక్కినేని కుటుంబంలో చాలా మంది పేర్లు “నాగ” అనే పదంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు, నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య వంటి పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల వెనుక ఒక భావోద్వేగం ఉంది.

Also Read: Telangana: సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. బంపర్ ఆఫర్ ఇవ్వనున్న కాంగ్రెస్!!

“మా అమ్మకు నన్ను జన్మనిచ్చిన రోజు ఒక కల వచ్చింది. ఆమె చుట్టూ తిరుగుతున్న నాగుపాము కనిపించింది. దీంతో ఆమె నన్ను నాగదేవతగా భావించి, నా పేరు నాగేశ్వరరావు పెట్టింది.” ఈ సెంటిమెంట్ ఆ తరువాత నాగార్జున వరకు కొనసాగింది. “నాకు నాగార్జున అనే పేరు పెట్టడానికి కారణం, అప్పట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. నాకు అది ఇష్టం, నాగార్జున అనే పేరు కూడా భావోద్వేగంగా అనిపించింది,” అని ఏఎన్నార్ తెలిపారు. ఈ భావోద్వేగం నాగ చైతన్య వరకు కొనసాగిందని కూడా పేర్కొన్నారు.

ఇక ఏఎన్నార్ నాగార్జున మరియు నాగ చైతన్యతో మనం కలిసి చేయగా వారి కుటుంబానికి ఈ చిత్రం క్లాసిక్ సినిమాగా నిలిచింది. సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు అయన మృతిచెందారు. ఇక నాగార్జున ఇటీవలే ఓ కాంట్రవర్సీ లో ఇరుక్కున్నారు. అయన నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ప్రభుత్వం కూల్చేయగా నాగచైతన్య నటి శోభిత ను రెండో పెళ్లి చేసుకున్నారు.