The star hero who fell in love with Simran

Simran: తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు తమ నటనతో మంచి హోదాలో ఉండి చిత్ర పరిశ్రమలో అత్యంత గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక వీళ్ళు ఇప్పటికీ సినిమాల్లో నటించకపోయినా కూడా ఇండస్ట్రీలో ఫేమస్ ఆర్టిస్టులు గానే మిగిలిపోయారు. ఇక ఎంతో మంది హీరోయిన్స్ ఫేడౌట్ అయిపోయాక తల్లి, అత్త పాత్రల్లో,విలన్ పాత్రల్లో రాణిస్తున్నారు. వారిలో సిమ్రాన్ కూడా ఒకరు.. 90స్ లో ఎంతోమంది కుర్రకారుని తన అందాలతో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

The star hero who fell in love with Simran

అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో రాణించింది. అయితే అలాంటి హీరోయిన్ సిమ్రాన్ ని ఓ హీరో ప్రేమ పేరుతో వాడుకొని మోజు తీరాక వదిలేద్దాం అనుకున్నారట. అయితే ఆ హీరో క్యారెక్టర్ ఎలాంటిదో ముందే తెలుసుకున్న సిమ్రాన్ ఎన్నిసార్లు ఆ హీరో తన సినిమాలో అవకాశం ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసిందట. అంతేకాదు అప్పట్లోనే అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని నిర్మాతలతో చెప్పించినా కూడా సిమ్రాన్ ఆ హీరో తో సినిమా చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట. (Simran)

Also Read: Varsha Bollamma: యంగ్ హీరోతో ప్రేమలో పడ్డ వర్ష బొల్లమ్మ..?

అంతే కాదు ఆ హీరో కనిపిస్తేనే మొహం పక్కకు పెట్టుకొని అసహ్యంగా చూసుకుంటూ వెళ్ళిపోయేదట.దాంతో ఆ హీరో ఎలాగైనా సరే తన సినిమాలో సిమ్రాన్ ని తీసుకోవాలి అని పగ పెంచుకున్నారట. కానీ సిమ్రాన్ మాత్రం ఆ హీరో తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా సిమ్రాన్ నేను కూడా లైంగిక వేదింపులకు గురైన బాధితురాలినే.. చిన్నతనంలో నేను ఎన్నో అనుభవించాను.

The star hero who fell in love with Simran

కానీ అవన్నీ ఇప్పుడు చెప్పలేను అంటూ సంచలన కామెంట్లు చేసింది.అంతేకాదు అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ కి గురైతే ఈ విషయాన్ని వెంటనే చెప్పలేరు.ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకునే టైమ్ కి జరగాల్సిందంతా జరిగిపోతుంది. అయితే ఈ విషయాన్ని బయట పెట్టే సమయంలో ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.(Simran)