Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి అరుదైన ఘనతను సాధించారు. భారత క్రీడాకారుల్లోనే అత్యధికంగా టాక్స్ చెల్లించిన క్రికెటర్ గా నిలిచారు. విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 66 కోట్ల పన్నును చెల్లించారు. Virat Kohli

Virat Kohli paid the highest tax among the sportspersons

ఈ విషయాన్ని ఫార్చూన్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా టాక్స్ చెల్లించిన స్టార్స్ జాబితాను ఫార్చున్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ రూ. 66 కోట్ల టాక్స్ చెల్లించి మొదటి స్థానంలో నిలిచారు.Virat Kohli

Also Read: Jay Shah: ప్రమాదంలో టీమిండియా …పాకిస్థాన్ చేతిలోకి బోర్డు.. జైషానే కారణమా?

తర్వాత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని రూ. 38 కోట్లతో రెండవ స్థానంలో, సచిన్ టెండూల్కర్ రూ. 28 కోట్లతో మూడవ స్థానం, సౌరభ్ గంగూలీ రూ. 23 కోట్లతో నాలుగవ స్థానం, హార్దిక్ పాండ్యా రూ. 13 కోట్లతో చివరి స్థానంలో నిలిచాడు. ఇక ఫార్చ్యూన్ ఇండియా లిస్ట్ లో భారతీయ సెలబ్రిటీలు అందరికన్నా బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ ఎక్కువగా ట్యాక్స్ చెల్లించారు. ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 92 కోట్ల పన్నును చెల్లించి మొదటి స్థానంలో నిలిచారు. Virat Kohli