Shahid Afridi: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షాహిద్ ని అభిమానులు ప్రేమగా బుమ్ బుమ్ ఆఫ్రిది అని పిలుస్తూ ఉంటారు. ఆఫ్రిది 1996లో శ్రీలంకలో జరిగిన వన్డే మ్యాచ్లో 37 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ రికార్డు తన పేరిటే ఉంది. 2014లో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరే అండర్సన్ 36 బంతుల్లో శతకం బాది ఆఫ్రిది రికార్డును బ్రేక్ చేశాడు. Shahid Afridi

Story Behind Shahid Afridi Using Sachin Tendulkar’s Bat To Score 37-Ball Century

ఓ ఏడాది పూర్తి అయిందో లేదో 2015లో వెస్టిండీస్ పై ఏబి డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాదాడు. కాగా, ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడినప్పటికీ కూడా శ్రీలంకపై 37 బంతుల్లోనే సెంచరీ చేసిన మ్యాచ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని షాహిద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎందుకంటే ఆ శతకాన్ని టీం ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ బ్యాట్ తో చేసినట్లుగా వెల్లడించాడు. Shahid Afridi

Also Read: Virat Kohli: రూ. 66 కోట్ల టాక్స్ కడుతున్న విరాట్ కోహ్లీ….!

లంకపై సెంచరీ చేసిన బ్యాట్ నాకు ఎంతో ప్రత్యేకతమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్లలో ఒకరైన టెండూల్కర్ బ్యాట్ అది. అతడి బ్యాట్ తోనే నేను వరల్డ్ రికార్డును సృష్టించాను. ఇందుకు వకార్ యూనిస్ కు ధన్యవాదాలు. లంకతో జరిగే మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా వకార్ ఈ బ్యాట్ ను నాకు ఇచ్చాడు. దానితోనే ఆడమని చెప్పాడని ఆఫ్రిది తెలిపాడు. Shahid Afridi

ఇక ఆ బ్యాట్ తో తర్వాత మరికొన్ని మ్యాచ్లు ఆడాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే దానిని కాపాడుకోవాలని అనుకున్నానని అందుకనే దాన్ని దాచుకున్నానని వెల్లడించాడు. కాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది…. తనకు వీలు కుదిరినప్పుడు మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.