Bellamkonda Srinivas caught romancing the star director daughter

Bellamkonda Srinivas: స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయులుగా ఇండస్ట్రీలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.ఇక వీరిద్దరిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ మోస్తరు గుర్తింపు అయితే సంపాదించారు. అల్లుడు శీను, జయ జానకి నాయకి, స్పీడున్నోడు, సాక్ష్యం, సీత, కవచం, రాక్షసుడు వంటి సినిమాల్లో హీరోగా నటించారు.

Bellamkonda Srinivas caught romancing the star director daughter

ఇక ఈ సినిమాల్లో అల్లుడు శీను, జయ జానకి నాయకి,రాక్షసుడు వంటి సినిమాలు మాత్రమే కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నాయి.మిగతా సినిమాలన్ని భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ ఆ రేంజ్ లో కలెక్షన్లు సంపాదించలేక పోయాయి. అయితే అలాంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా ఓ డైరెక్టర్ కూతురితో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.. (Bellamkonda Srinivas)

Also Read: Venkat Prabhu: నా తప్పేమీ లేదు.. నాగచైతన్య వేలు పెట్టడం వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.?

మరి ఇంతకీ ఆ డైరెక్టర్ కూతురు ఎవరు.. నిజంగానే సాయి శ్రీనివాస్ ఆ డైరెక్టర్ కూతురితో రిలేషన్ పెట్టుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డైరెక్టర్ కూతురితో రొమాన్స్ చేస్తున్నాడు అనేది నిజ జీవితంలో కాదు.అది సినీ జీవితంలో.. ఇక అసలు విషయం ఏమిటంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. విజయ్ కనకమేడలా దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గరుడన్ రీమేక్ లో నటిస్తున్నారు.

Bellamkonda Srinivas caught romancing the star director daughter

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతుర్నీ అదితి శంకర్ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ ఫిలిం టాకీస్ లో టాక్ వినిపిస్తోంది.అయితే ఇప్పడి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్ దర్శకుడు శంకర్ కూతురితో రొమాన్స్ చేయబోతున్నాడు అంటూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ మాత్రం వినిపిస్తోంది.మరి నిజంగానే వీరి కాంబోలో సినిమా రాబోతుందా అనేది చూడాలి..(Bellamkonda Srinivas)