Telangana: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. వారి అనర్హతపై కేవలం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఆలోపు నిర్ణయం తీసుకోలేకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని తెలియజేసింది. Telangana

three by elections in telangana

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ ఆదేశించాలని బీఆర్ఎస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. దానిపై విచారించిన ధర్మ స్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. Telangana

Also Read: Ms Dhoni: వివాదంలో ధోని భార్య సాక్షి….స్మోకింగ్ పిక్స్ వైరల్ ?

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పడం జరిగింది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టని తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడటం ఖాయమంటూ హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తప్పకుండా జరుగుతుందని ఎక్స్ వేదికగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ తెలిపారు. Telangana