Aarti: It's all fake.. Please don't believe it..

Aarti: ఏంటి జయం రవి విడాకుల వార్తలు అంతా ఉత్తుత్తేనా.. ఆయన చెప్పింది మొత్తం ఫేకా.. ఇంతకీ జయం రవి భార్య ఆర్తి పెట్టిన పోస్ట్ లో ఉన్న నిజం ఏంటి.. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో ఇప్పుడే చూద్దాం.. గత రెండు రోజుల నుండి జయం రవి ఆర్తిల విడాకుల వార్తలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే ఈ జంట విడాకులు ప్రకటించేసరికి చాలామంది ఫీల్ అవుతున్నారు..

Aarti: It’s all fake.. Please don’t believe it..

15 ఏళ్ల వీరు వైవాహిక బంధానికి ఎందుకు స్వస్తి పలకారో తెలియక ఎన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.. అయితే జయం రవి ఈ విడాకులను అనౌన్స్ చేసినప్పటికీ ఆర్తి మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది ఆర్తి. అంతా ఫేక్ దృష్ప్రచారం చేయకండి అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూసిన చాలా మంది జనాలు షాక్ అవుతున్నారు.(Aarti)

Also Read: Jayam Ravi: అనుకున్నదే జరిగింది.. జయం రవి విడాకులకు ఆ హీరోయినే కారణం..?

మరి ఇంతకీ ఆర్తి పెట్టిన పోస్టులో ఏముంది అంటే.. విడాకుల విషయంలో నేను రవితో మాట్లాడాలని చూసాను. కానీ ఆ అవకాశం దొరకలేదు. అలాగే విడాకులను నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా ప్రకటించడం నాకు కాస్త బాధనిపిస్తోంది.నేను ఈ విషయంలో దిగ్భ్రాంతి చెందుతున్నాను. అలాగే విడాకులు ప్రకటించడంతో చాలామంది నా వ్యక్తిత్వం మీద ఎన్నో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.

Aarti: It's all fake.. Please don't believe it..

అవన్నీ ఫేక్ దయచేసి వాటిని నమ్మకండి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను నా పిల్లలను బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం ఆర్తి పోస్ట్ చూసినా చాలామంది జనాలు కనీసం ఈ భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే గొడవలు సమసిపోయేవి కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. తొందరపాటు నిర్ణయంతోనే జయం రవి ఈ పని చేశారని కొంతమంది భావిస్తున్నారు.(Aarti)