Jayam Ravi divorce is the reason for that heroine

Jayam Ravi: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో అయినా లేదా హీరోయినైనా విడాకులు తీసుకుంటే ఖచ్చితంగా వారి విడాకుల విషయంలో ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అలా ఇప్పటికే విడాకులు తీసుకున్న చాలా మంది సెలబ్రెటీల విషయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి.అయితే తాజాగా విడాకులు తీసుకొని విడిపోయిన జయం రవి, ఆర్తిల విడాకుల విషయంలో కూడా కొన్ని రూమర్లు వైరల్ అవుతున్నాయి అందులో ఒకటి ఏంటంటే..

Jayam Ravi divorce is the reason for that heroine

జయం రవి మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ఆ విషయం ఆర్తి కి నచ్చక ఆమె గొడవలు పెట్టి విడాకులు తీసుకుంది అనే రూమర్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష అనే పేరు కోలీవుడ్ మీడియా వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక త్రిష,జయం రవి కాంబినేషన్లో ఇప్పటికే తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాని తమిళ్ రీమేక్ గా వచ్చిన వునక్కం ఎనక్కం అనే సినిమాలో జయం రవితో త్రిష కలిసి నటించింది.(Jayam Ravi)

Also Read: Jayam Ravi: రోజు కారులోనే రొమా**.. జయం రవి సినిమాటిక్ లవ్ స్టోరీ..?

అలాగే సకలకల వల్లవన్, భూలోహం, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ -2 వంటి సినిమాలు వచ్చాయి.అయితే పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించే సమయంలో త్రిషకి జయం రవికి మధ్య ఉన్న క్లోజ్నెస్ కారణంగానే ఆర్తి జయం రవికి మధ్య విడాకులు తీసుకున్నారని,త్రిష తో రవి ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చారంటూ ఒక రూమర్ కోలీవుడ్లో వినిపిస్తుంది.

Jayam Ravi divorce is the reason for that heroine

కానీ త్రిష అభిమానులు మాత్రం ఈ వార్తలపై మండిపడుతున్నారు. ఎవరు విడాకులు తీసుకున్నా కూడా అందులో త్రిష పేరును యాడ్ చేయడమేనా, ఆమె పేరు అంత ఈజీగా ఎలా వాడతారు.. ప్రతి సెలబ్రిటీ విడాకులు తీసుకోవడంలో త్రిష పేరును ఎందుకు యూస్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.మరి ఈ విషయంపై త్రిష ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.(Jayam Ravi)