Mohan Babu University: మోహన్ బాబు దందాలు బయటపడుతున్నాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నసంగతి తెలిసిందే. అయితే…ఈ మోహన్ బాబు యూనివర్సిటీ పై విజయవాడ లోని అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు మోహన్ బాబు యూనివర్సిటీ పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

mohan babu university violating norms

పెరెంట్స్ కమిటీ అసోసియేషన్ కమిటీ ఏకమై…విజయవాడ లోని అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. డేస్ కాలర్స్ కచ్చితంగా మెస్ లోనే భోజనం తినాలని రూల్‌ పెట్టారని… ఇష్టాను సారముగా ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ పీజులు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ…మోహన్ బాబు యూనివర్సిటీ పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Also Read: Telangana: తెలంగాణ 3 ఉప ఎన్నికలు… ఇక ఓటర్లకు జాతరే?

లంచ్ టైమింగ్ పై అభ్యంతరాలు కూడా తెలిపారట. యూనివర్సిటీ లో బౌన్సర్లతో విద్యార్థులను కొడుతున్నారని కూడా ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు మోహన్ బాబు యూనివర్సిటీ పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీచింగ్ స్టాప్ కు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన తల్లి తండ్రుల అసోసియేషన్..న్యాయం కోసం రోడ్డు ఎక్కారు.