Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తన అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో విజయాలను సాధించాడు. అతి చిన్న వయసులోనే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన గిల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గిల్ ఆదివారం రోజున 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం గిల్ దులీప్ ట్రోఫీ 2024 మ్యాచ్ లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం తన స్నేహితులతో కలిసి గిల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. Shubman Gill

Shubman Gill Avneet Kaur Dating Rumor

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బర్త్డే పార్టీలో తన స్నేహితుడు ప్రముఖ పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లాతో కలిసి పంజాబీ ర్యాప్ పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ కనిపించాడు. అంతేకాకుండా ఈ పార్టీలో గిల్ పీకల దాకా తాగి తన స్నేహితులతో కలిసి చిందులు వేశాడు. ఇప్పుడు ఈ వార్త వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా గిల్ అవనీత్ కౌర్ అనే బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి తాగుతూ ఎంజాయ్ చేశాడనే వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా…. గిల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ నటీనటులు విషెస్ తెలియజేశారు. Shubman Gill

Also Read: RCB: RCB కెప్టెన్‌గా యంగ్‌ ప్లేయర్‌…ఇక దుమ్ములేపడమే ?

అటు బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లు సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో గిల్ కూడా ఉన్నాడు. బహుశా గిల్ మూడో నెంబర్ బ్యాటర్ గా క్రీజులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అటు బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్లలో 2-0 తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ కు ఇదే తొలి టెస్ట్ రావడం విశేషం. ఇండియాతో జరిగే టెస్ట్ సిరీస్ లోను రాణించేందుకు జట్టు సభ్యులు ఉత్సాహంగా ఉన్నారు. Shubman Gill