Chinmayi revealed by star singer true nature

Chinmayi: చిన్మయి.. ఈమె పేరు చెబితేనే చాలామంది గుండెల్లో దడలు పుట్టుకొస్తాయి. ఎవరైతే ఈమెను వేధించారో వారి పేర్లు బహిరంగంగానే చెబుతూ వారి పరువు మొత్తం తీసేస్తుంది.ఏ విషయమైనా సరే ఎలాంటి భయం లేకుండా బయట పెట్టగల ధైర్యవంతురాలు. అందుకే చిన్మయిని ఎవరైనా ఏమైనా అనడానికి కాస్త ముందు వెనక ఆలోచిస్తారు. స్టార్ సింగర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న చిన్మయి ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తుంది.

Chinmayi revealed by star singer true nature

అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఎక్కువ ఫేమస్ అయింది.అయితే ప్రస్తుతం కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో గతంలో చిన్మయి మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. అయితే ఓ సింగర్ బాగోతాన్ని బయటపెట్టింది చిన్మయి.. ఇక ఆయన ఎవరో కాదు స్టార్ సింగర్ గా సౌత్ లో ఫేమస్ అయిపోయిన కార్తీక్.. సింగర్ కార్తీక్ గురించి చిన్మయి మాట్లాడుతూ.. (Chinmayi)

Also Read: Kamal Haasan: కమల్ హాసన్ కూతురి బాత్రూం ఫొటోస్ లీక్ చేసిన ప్రియుడు.. అందుకే బ్రేకప్.?

కార్తీక్ అంటే సింగర్ గా నాకు ఎంతో గౌరవం ఉంది.కానీ ఆయన తన హోదాని పక్కనపెట్టి ఎంతోమందిని వేధించాడు.. ఇప్పటికి కార్తీక్ కి సంబంధించిన ఎంతోమంది బాధితులు స్విజర్లాండ్, హైదరాబాద్, చెన్నై వంటి ప్రదేశాలలో ఉన్నారు. ఆయన ఎంతో మంది అమ్మాయిలను వేధించాడు.. అమ్మాయిలకు అసభ్య ఫోటోలు, వీడియోలు పంపి డేటింగ్ కి వెళ్దామా..లాంగ్ డ్రైవ్ కి వస్తావా అంటూ అడుగుతాడు. ఇక మరో విషయం ఏమిటంటే కార్తీక్ బండారం బయట పెడితే సింగర్ మనో గారు నాకు ఫోన్ చేసి ఎందుకు అలా చేస్తున్నావు. ఆయన కెరీర్ నాశనం అవుతుంది అని అన్నాడు.

Chinmayi revealed by star singer true nature

కానీ నేను మాత్రం ఆ విషయాన్ని దాచకుండా ఉండలేను అని చెప్పేసాను.అంతేకాదు మనో గారు ఎందుకు కార్తీక్ ని వెనకేసుకు వచ్చారో కూడా నాకు అర్థం కాలేదు.. ఇక ఈ విషయం నేను బయటపెట్టాక సరిగమప షోలో ఇద్దరం పక్క పక్కనే జడ్జిగా కూర్చోవలసి వచ్చింది. కానీ ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు. అంటూ సింగర్ చిన్మయి కార్తీక్ బండారం మొత్తం బయటపెట్టింది.దీంతో కార్తీక్ ని ఇండస్ట్రీలో చాలామంది అప్పట్లో వేలెత్తి చూపెట్టారు. కానీ ప్రస్తుతం ఆ విషయం సర్దుమనిగినప్పటికీ మళ్లీ హేమ కమిటీ రిపోర్ట్ ద్వారా వైరల్ గా మారింది.(Chinmayi)