Hema did that by taking drugs

Hema: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన హేమ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిక్కుల్లో పడుతున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె పాల్గొని నేను అక్కడ లేను అంటూ అబద్ధపు సాక్షాలు సృష్టించడం కోసం వీడియోలు రిలీజ్ చేసింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం హేమా అక్కడే ఉందని తేల్చి చెప్పారు. అంతేకాదు ఆ పార్టీలో హేమ డ్రగ్స్ కూడా తీసుకుందని కొంతమంది సోషల్ మీడియా జనాలు, మీడియా వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేశారు.

Hema did that by taking drugs

దీంతో మీడియా ముందుకు వచ్చి హేమ రచ్చ రచ్చ చేసింది.నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. అసలు డ్రగ్స్ టెస్ట్ చేయముందు డ్రగ్స్ తీసుకుందని ఎలా రాస్తారు.ఇప్పుడే నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను.నాకు నెగిటివ్ వచ్చింది అంటూ ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పింది. అంతే కాదు మా అసోసియేషన్ నుండి హేమను తీసేసారు. ఆ తర్వాత నెగటివ్ వచ్చిందని చెప్పడంతో మళ్ళీ మా అసోసియేషన్ లో ఆమెను భాగం చేసుకున్నారు.(Hema)

Also Read: Aarti: అదంతా ఫేక్.. ప్లీజ్ నమ్మకండి.. విడాకులపై జయం రవి భార్య షాకింగ్ ట్విస్ట్..?

అయితే తాజాగా బెంగళూరు పోలీసులు హేమ గురించి సంచలన విషయం బయటపెట్టారు.హేమ ఆ పార్టీలో ఉన్నది నిజమే..అలాగే ఆ పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకుంది.హేమ తన ఫ్రెండు పిలవగా ఆ పార్టీకి వెళ్ళింది.ఆ పార్టీలో డ్రగ్స్ కూడా తీసుకుంది అని పోలీసులు తెల్చేశారు.దీంతో ఒక్కసారిగా హేమ డ్రగ్స్ వ్యవహారం మరొకసారి మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాదు బెంగళూరు రేవ్ పార్టీలో దాదాపు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ రిపోర్టు కూడా జత చేశారు.

Hema did that by taking drugs

అలాగే హేమపై చార్జిషీట్ తీసుకున్నారు. దీంతో హేమ వ్యవహారం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ హేమకు పోలీసుల నుండే కాదు మా అసోసియేషన్ నుండి కూడా షాక్ తగలబోతోంది. ఎందుకంటే ఆమెకు డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వస్తే కచ్చితంగా మా అసోసియేషన్ నుండి తొలగిస్తామని మంచు విష్ణు చెప్పారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చింది కాబట్టి మా అసోసియేషన్ నుండి హేమకి షాక్ తగలబోతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Hema)