Samantha was humiliated by the star hero

Samantha: ఏంటి సమంతకి అవమానమా.. అంత పెద్ద హీరోయిన్ ని అవమానించిన హీరో ఎవరు? ఎందుకు ఆ హీరో చేతిలో సమంత అవమానానికి గురైంది అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరోయిన్ సమంత ఎంతోమంది హీరోలతో జతకట్టింది. అలా తెలుగులో మహేష్ బాబు,ఎన్టీఆర్,బన్నీ, నాగ చైతన్య,రామ్ చరణ్ ఇలా ఎంతోమంది హీరోలతో నటించింది. అయితే ఇంతమంది హీరోలతో నటించిన సమంతకు ఎలాంటి ఇబ్బంది కలగలేదట.కానీ ఆ స్టార్ హీరో ఘోరంగా అవమానించారట.

Samantha was humiliated by the star hero

ఇక ఆ హీరో ఎవరు కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక అసలు విషయం ఏమిటంటే..సమంత ఓసారి మహేష్ బాబుని, త్రివిక్రమ్ ని ఇంటర్వ్యూ చేసింది.ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ని రిమేక్ సినిమాల గురించి అడుగుతూ..మీరు రీసెంట్గా చూసిన సినిమా ఏంటి అని అడగగా విజయ్ కత్తి మూవీ అని చెప్పారు.అయితే ఆ సినిమా బాగుంది అని మహేష్ చెప్పడంతో మరి దాన్ని రీమేక్ చేయవచ్చు కదా అని సమంత అడిగింది. దానికి మహేష్ బాబు నేను రీమేక్ చేయను నాకు రీమేక్ చేస్తే నచ్చదు.(Samantha)

Also Read: Jayam Ravi: అనుకున్నదే జరిగింది.. జయం రవి విడాకులకు ఆ హీరోయినే కారణం..?

రీమేక్ చేస్తే ఆ హీరోనే గుర్తుకు వస్తాడు.కత్తి మూవీ రీమేక్ చేస్తే నాకు విజయ్ గుర్తుకు వస్తాడు.అందుకే నాకు రీమేక్స్ నచ్చవు అని చెప్పారు. దాంతో సమంత మరి మీ సినిమాలు విజయ్ రీమేక్ చేస్తారు కదా అని అడగగా.. రీమేక్స్ చేస్తే నేను వారిని తగ్గించి మాట్లాడను. ఎవరి ఇష్టం వారిది అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు మీకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరు అని సమంత అడుగుతూ.. అఫ్కోర్స్ మీ ఇష్టమైన హీరోయిన్ నేనే అని కూడా సమాధానం చెప్పింది.కానీ మహేష్ మాత్రం సమంతకు కౌంటర్ ఇస్తూ నాకు ఇష్టమైన హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నాను అంటూ సామ్ ని అవమానించారు.

Samantha was humiliated by the star hero

అంతేకాదు త్రివిక్రమ్ తో మళ్ళీ మీ సినిమా ఎప్పుడు రాబోతుంది. ఆ సినిమాలో నేనే కదా హీరోయిన్ ని అంటూ సమంత మళ్ళీ ప్రశ్నించగా దానికి మహేష్ తెలివిగా సమాధానం ఇస్తూ మా ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది. కానీ అందులో హీరోయిన్ నువ్వో కాదో తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చారు.దీంతో సమంత ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో సమంతకి మహేష్ బాబు మంచి కౌంటర్స్ ఇచ్చారు. ఈ దెబ్బతో సమంతకి ఘోర అవమానం జరిగినట్లే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)