The star hero who missed the movie Devara

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా వచ్చిన తాజా మూవీ దేవర.ఈ సినిమా ఇంకో 15 రోజుల్లో విడుదలవబోతుంది.అయితే సినిమా విడుదలకు ముందు సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. అలా తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. దేవర సినిమాలో హీరోగా చేయాల్సింది జూనియర్ ఎన్టీఆర్ కాదట. మరో హీరో చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేశారట. ఇక ఆ హీరో ఎవరు..ఎందుకు ఆయన ఈ సినిమాని వదులుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..

The star hero who missed the movie Devara

జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా ముందుగా అల్లు అర్జున్ చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండి అల్లు అర్జున్ తప్పుకున్నారట. అయితే ఇందులో ఉన్న అసలు నిజం ఏమిటంటే..పుష్ప సినిమా విడుదలయ్యాక కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఏఏ 21 సినిమా రాబోతుంది అని ఒక ప్రీ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అయితే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా కన్ఫామ్ చేశారు. దాంతో కొరటాల శివ, బన్నీ కాంబోలో మూవీ రాబోతుందని సంతోషపడ్డారు. ( Devara)

Also Read: Janhvi Kapoor: దేవర షూటింగ్లో జాన్వీ కపూర్ ని టార్చర్ చేసిన స్టార్ హీరో..?

ఇక ఈ మూవీని గీత ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారని కూడా అధికారిక ప్రకటన వచ్చింది.కానీ అనూహ్యంగా ఈ సినిమాకి తెరపడింది. దాంతో కొరటాల శివ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి దేవర సినిమా చేశారు. అయితే దేవర సినిమాలో ఉన్నట్టే ఏ ఏ 21 సినిమా ప్రీ లుక్ పోస్టర్లో కూడా పడవ వంటివి కనిపించాయి. దాంతో అల్లు అర్జున్ చేయాల్సిన దేవర మూవీ జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సి వచ్చింది అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

The star hero who missed the movie Devara

అయితే ఈ సినిమా చేయకపోవడానికి ఆచార్య సినిమా విషయంలో జరిగిన వివాదమే కారణమని కొంతమంది అనుకుంటుంటే,మరి కొంతమందేమో పుష్ప సీక్వెల్ గా పుష్ప-2 సినిమాలో బిజీగా ఉండడం వల్ల అల్లు అర్జున్ దాన్ని రిజెక్ట్ చేశారని అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. (Devara)